Genelia new car: తుఝే మేరీ కసమ్ చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జెనీలియా డి సౌజా. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించిన ఈ అందాల సుందరాంగి. తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. బొమ్మరిల్లు సినిమాలో అల్లరి పిల్లగా నటించింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాతోనే జెనెలియా తెలుగు ప్రేక్షకులను చేరువ అయింది. ఈ సినిమాలో జెనెలియా నటన సూపర్ క్యూట్ గా ఉంది. ఆ సమయంలో ప్రతి ఒక్క అమ్మాయి జెనెలియాగా అల్లరి పిల్లగా ఉండటానికి తెగ ప్రయత్నించారు.
ఆ తర్వాత జెనెలియా ఢీ, రెడీ, ఆరెంజ్ సినిమాల్లో నటించింది. ఇందులో ఆరెంజ్ సినిమా అలా అలా నడవగా.. మిగతా రెండు సినిమాలు సూపర్ హిట్ సాధించాయి. అలా మరింతగా తెలుగు ప్రేక్షకులకు చేరువ అయింది జెనెలియా. బాలీవుడ్ నుండి వచ్చినా.. పక్కా తెలుగు అమ్మాయిలా అభిమానులను సొంతం చేసుకుంది. తర్వాత రితేష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లి గా మారింది.
ప్రస్తుతం జెనెలియా ఖరీదైన కారును కొనుగోలు చేసింది. బీఎండబ్ల్యూకు చెందిన ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసింది. ఈ కారు ధర రూ. 1.4 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఈ బ్రాండ్ న్యూ కారులనో జెనెలియా ఫ్యామిలా.. సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఇంట్లో జరిగిన వినాయక చవితి వేడుకలకు వెళ్లినట్లు తెలుస్తోంది.