Gargi Movie Review : లేడి పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) లీడ్ రోల్‌లో నటించిన మూవీ గార్గి (Gargi). రవిచంద్రన్ రామచంద్రన్, ఐశ్వర్య లక్ష్మీ, థామస్ జార్జ్ సంయుక్తంగా నిర్మించిన ఈ లేడీ ఓరియెంటెడ్ గార్గి మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన గార్గి జూలై 15 (శుక్రవారం) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ గార్గి మూవీకి సంబంధించి అమెరికాలో ప్రీమియర్స్ పడ్డాయి. గార్గి మూవీ చూసిన వారంతా ట్విట్టర్ వేదికగా గార్గి ఫస్ట్ రివ్యూ ఇచ్చేస్తున్నారు.
ట్విట్టర్ ఫస్ట్ రివ్యూ (Gargi Twitter Review) ప్రకారం.. గార్గి మూవీతో సాయి పల్లవి తన నటవిశ్వరూపాన్ని మరోసారి చూపించింది. అమెరికా ప్రీమియర్స్‌లో గార్గి మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సాయి పల్లవి నటన అద్భుతమని, చాలా నేచురల్ గా నటించిందని, ఆమెకు నేషనల్ అవార్డు ఖాయమని ట్విట్టర్‌లో ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజన్లు. తండ్రికి న్యాయం చేసేందుకు సాయి పల్లవి పడరాని కష్టాలు పడే కూతురిగా అద్భుతంగా నటించింది. యదార్థ సంఘటనల ఆధారంగా పోలీసుల కస్టడీ నుంచి తండ్రిని విడిపించుకునే కూతురిగా పోరాడిన విధానం ప్రతి ప్రేక్షకుడిని కదిలించేలా ఉందంటున్నారు. తండ్రిని పోలీసుల కస్టడీ నుంచి కాపాడుకునేందుకు ఒక కూతురు చేసే పోరాటమే ఈ గార్గి మూవీ.
సమాజంలో స్త్రీకి ఉండే కట్టుబాట్లు, పరిమితులతో తల్లిదండ్రుల కోసం కూతురు పోరాడే అమ్మాయిగా సాయి పల్లవి అద్భుతంగా నటించిందని అంటున్నారు. గార్గి మూవీ చూసిన వాళ్లంతా గార్గి వన్ ఉమెన్ షో అని కామెంట్ చేస్తున్నారు. సాయి పల్లవి కెరీర్‌లోనే గార్గి (Gargi Movie) ది బెస్ట్ మూవీ అంటూ కామెంట్ చేస్తున్నారు. సాయిపల్లవి మంచి నటిగా బలమైన పాత్రలనే ఎంచుకుంటోంది.
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే లేడీ ఓరియెంటెడ్ మూవీలను చేస్తోంది. నటిగా నిరూపించుకుంటోంది. `విరాటపర్వం`లో మూవీతో మెప్పించిన సాయి పల్లవి ఇప్పుడు `గార్గి`(Gargi) మూవీలోనూ అదే స్థాయలో నటించి అందరిని మెప్పిస్తోంది లేడీ పవర్ స్టార్. ఈ మూవీ రిలీజ్ కాకముందే.. చిత్ర బృందం తమిళనాడులో సినీ క్రిటిక్స్, మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు. `గార్గి` మూవీని తమిళంతోపాటు తెలుగు, కన్నడలోనూ రిలీజ్ చేస్తున్నారు.
కథ విశ్లేషణ :
సాయిపల్లవి(గార్గి) అనే టీచర్‌గా నటించింది. ఆమె తండ్రి కోసం న్యాయపోరాటాన్ని చేస్తుంది. సాయిపల్లవి టీచర్‌గా జాబ్ చేస్తుంటుంది. ఆమె తండ్రి సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తాడు. అయితే అనుకోకుండా ఒకరోజున ఒక కేసులో గార్గి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అప్పటినుంచి తండ్రి ఎక్కడున్నాడో ఆమెకు తెలియదు. తండ్రిని కలిసేందుకు గార్గి వెళ్తే పోలీసులు పట్టించుకోరు. న్యాయం కోసం, తండ్రిని నిర్దోశిగా విడిపించేందుకు సాయి పల్లవి ఎలా పోరాటం చేసింది అనేది ఈ స్టోరీ..
Gargi Movie Review : `గార్గి` ట్విట్టర్ రివ్యూ.. షాకింగ్ రేటింగ్..!
ప్రస్తుతం `గార్గి` మూవీ రివ్యూ ట్విట్టర్లో వైరల్ అవుతుంది. కోలీవుడ్ క్రిటిక్స్ `గార్గి` మూవీకి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చేశారు. చాలామంది 5 స్టార్ రేటింగ్ ఇవ్వగా, మరికొంత మంది 4 రేటింగ్ ఇచ్చారు. ఏకంగా సాయిపల్లవికి ఈ ఏడాది జాతీయ అవార్డు పక్కా అంటూ కామెంట్లు పెట్టడం విశేషం. సూర్య,జ్యోతికలు ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించినప్పుడే ఈ చిత్రంలో ఎంతటి స్టఫ్ ఉందో అర్థం చేసుకోవచ్చు అని, ఈ ఏడాది బెస్ట్ మూవీలో ఇది ఒకటిగానిలుస్తుందని చెబుతున్నారు. అంతేకాదు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తున్నారు.
ఇప్పటి వరకు వచ్చిన మూవీలో ది బెస్ట్ మూవీ గార్గి అంటున్నారు. దర్శకుడు సెన్సిటివ్ సబ్జెక్ట్‌ని చాలా బాగా హ్యాండీల్ చేశాడని చెబుతున్నారు. సమాజంలో మహిళల పాత్రలని బలంగా ఆవిష్కరించారని, సందేశాత్మక మూవీగా ట్విట్టర్‌లో విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకుడు పీఆర్ గౌతమ్ అద్భుతమైన కథగా గార్గిని తెరపై ఆవిష్కరించారని అంటున్నారు. సౌండ్ డిజైనింగ్, దర్శకుడు మ్యాజిక్ చేశారని, క్లైమాక్స్ అద్భుతంగా ఉందని అంటున్నారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగున్నాయని, సినిమాటోగ్రాఫర్ పనితీరు సూపర్ అంటున్నారు. ఈ మూవీలో క్లైమాక్స్ పెద్ద హైలైట్ అంటున్నారు. సాయి పల్లవి నటనకు `టేక్ ఏ బౌ` అంటూ ట్విట్టర్‌లో కామెంట్లు పెడుతున్నారు. ఏదిఏమైనా జూలై 15న గార్గి మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీని అందరూ తప్పనిసరిగా థియేటర్లలోకి వెళ్లి చూడాల్సిందే.. సాయి పల్లవి నటన విశ్వరూపాన్ని చూసేందుకు అయినా ప్రతిఒక్కరూ ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూడొచ్చు.
#Gargi Review
AdvertisementA Court Crime Drama🍿Plot- Dad & Daughter RelationShip♥️SaiPallavi impresses👍🏼KaaliVenkat LifeTime Best👌🏼BGM & Songs Evolves🤞🏼Slow Paced with Best Screenplay💥Dialogue Court Jail Scene Woks Well✅Twist & Turns🔥Book Tickets With Your Family🙏🏼
AdvertisementSaloon Rating: 4.5/5 pic.twitter.com/XvsuIAdUjD
Advertisement— Saloon Kada Shanmugam (@saloon_kada) July 13, 2022
Advertisement
#Gargi – a rare full 5* film. In theaters from tomorrow. Do watch and support!This one deserves a Boxoffice success👍
AdvertisementPre-Covid, such powerful content based films would also do wonders at the BO. Have to see if Gargi can set a new post-Covid trend now 👍 pic.twitter.com/40Tug3AGso
Advertisement— Kaushik LM (@LMKMovieManiac) July 14, 2022
Advertisement
Read Also : The Warrior Movie Review : `ది వారియర్` మూవీ రివ్యూ.. ఊరమాస్ రామ్ విశ్వరూపం చూపించాడు!