Viral Video: అమ్మాయిలే కాదండోయ్.. ఈ ఏనుగు కూడా ఎంచక్కా పానీ పూరీ లాగించేస్తోంది!

Elephant eats pani puri at roadside stall video goes viral
Elephant eats pani puri at roadside stall video goes viral

Viral Video: పానీపూరీల గురించి వాటిని ఎక్కువగా ఇష్టపడుతూ లాగించే అమ్మాయిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ స్టా, ఫేస్ బుక్, యూట్యూబ్ లలో అమ్మాయిలు పానీపూరి లాగించే వీడియోలు, మీమ్స్ విపరీతంగా కనిపిస్తాయి. అయితే అమ్మాయిలే కాదండోయ్ ఓ ఏనుగు కూడా పానీపూరిని లేగించేసింది. అలా ఇలా కాదండ్.. చక్కగా చాలా ఇష్టంగా తినేసింది. రోడ్డు పక్కనే ఉన్న ఓ స్టాల్ వద్ద నిలబడీ మరీ పానీపూరి కుమ్మేసింది. అయితే ఏనుగుకు సదరు బండి అతనే సర్వ్ చేయడం గమనార్హం.

Advertisement

ఎనుగు కూడా దొరికాయి కదా అని.. అన్నీ ఒకేసారి కాకుండా ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటూ హాయిగా ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ ఘటన అస్సాంలోని తేజ్ పూర్ లో చోటు చేసుకుంది.

Advertisement

అయితే దీన్ని చూసిన ప్రతీ ఒక్కరూ వీడియోను షేర్ చేస్తుండటంతో… నెట్టిళ్లు మొత్తం షేక్ అవుతోంది. చిన్న పిల్లలు తింటుంటే ఎంత ముద్దుగా అనిపిస్తుందో ఈ ఏనుగు పానీపూరి తింటుంటే కూడా అంతే ముద్దుగా అనిపిస్తోంది.  మీరూ ఓ సారి ఈ వీడియోపై లుక్కేయండి.

Advertisement