Dussehra: ఈ ఏడాది దేశవ్యాప్తంగా ప్రజలు దసరా పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరుపుకునే ఈ దసరా పండుగ హిందూ ప్రజలకు ఎంతో ముఖ్యమైన పండుగగా భావిస్తారు.దేవి నవరాత్రులను పూర్తి చేసుకున్న అనంతరం పదవ రోజు ఈ దసరా పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి పాండవులు కౌరవులపై విజయదశమి రోజే విజయం సాధించారని అలాగే రావణాసురుడి మరణం కూడా విజయదశమి రోజే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.
![Dussehra : నేడే దసరా.. ధనవంతులు కావాలంటే ఈ మూడు వస్తువులను దానం చేయాల్సిందే! dusshera.jpg,](https://tufan9.com/wp-content/uploads/2022/10/dusshera.jpg.jpg)
ఇలా అధర్మం పై ధర్మం గెలిచిన రోజున పెద్ద ఎత్తున ఈ విజయదశమి పండుగను జరుపుకుంటారు. ఇక విజయదశమి రోజు ఎంతోమంది ఎన్నో నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏడాది పాటు తమ కుటుంబం సంతోషంతో ఆనందంతో వెళ్లి విరుస్తుందని భావిస్తారు. ఈ క్రమంలోనే ఈ విజయదశమి రోజు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.
Dussehra: విజయదశమి .. ధనవంతులు కావాలంటే ఈ మూడు వస్తువులను దానం చేయాల్సిందే!
ఈ క్రమంలోనే విజయదశమి రోజు మనం చేసే దానం ఇతరులకు తెలియకుండా చేయటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఆమె కరుణ కటాక్షాలు మనపై ఉండటం వల్ల మనం ధనవంతులవుతాము. మరి విజయదశమి రోజు దానం చేయాల్సిన ఆ మూడు వస్తువులు ఏమిటి అనే విషయానికి వస్తే.. మనం ఏదైనా ఆలయానికి కొత్త చీపురును దానం చేయడం ఎంతో శుభప్రదం. ఇలా చీపురుని దానం చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. అదేవిధంగా ఈ పండుగ రోజు బట్టలు అన్నం నీటిని దానం చేయడం ఎంతో మంచిది.ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుందని ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారని పండితులు తెలియజేస్తున్నారు.
Read Also : Shani Dev: శని దేవుని కృపతో ఈ ఐదు రాశుల వారికి అద్భుత ఫలితాలు..?