Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి మాటలకు సామ్రాట్ వాళ్లు ఆశ్చర్యపోతారు.
ఈరోజు ఎపిసోడ్ లో నా ప్రేమ్ నాకు ఎప్పుడూ అండగా ఉంటాడు. అమ్మని విడిచి ఎప్పటికీ వెళ్ళడు అని అనడంతో ప్రేమ్ సంతోష పడుతూ ఉంటాడు. అప్పుడు ప్రేమ్ అమ్మ నేను నీతో పాటు ఇక్కడే ఉంటాను ని బాధ్యతలను చూసుకుంటూ ఉంటాను నీకు ఎటువంటి ఇబ్బంది కలిగించను నన్ను కూడా ఇక్కడే ఉండనివ్వు అమ్మ అని అంటాడు. అప్పుడు తులసి సరే అనడంతో ప్రేమ్ జోకులు వేసి తులసిని నవ్విస్తాడు. ఆ తర్వాత తులసి తన తల్లితో అమ్మ నేను ఇక్కడే ఉంటే మీరు ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఎన్నో యుద్ధాలు చేయాల్సి వస్తుంది కానీ ఈ పనికిరాని యుద్ధాలు చేయకూడదు అమ్మ అని అంటుంది.
అప్పుడు తులసి వాళ్ళ అమ్మ కూడా తులసికి ధైర్యం చెబుతూ నువ్వు ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను తులసి అంటుంది. అప్పుడు సామ్రాట్ మా కంపెనీ తరఫున ఎంప్లాయిస్ కి రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తాం అనడంతో థాంక్స్ సామ్రాట్ గారు ఇప్పుడైతే అవసరం లేదు అని అంటుంది తులసి. మరొకవైపు ఇంట్లో అందరూ భోజనానికి కూర్చోగా అందరూ అన్నం తినకుండా ఆలోచిస్తూ ఉండడంతో నందు వారి మనసు మార్చే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు లాస్య ఆ తులసి ఏమో సామ్రాట్ కోసం ఇల్లు విడిచి వెళ్ళిపోయింది మీరు మాత్రం అలాగే ఉంటారా అనడంతో పరంధామయ్య బాధతో అన్నం తినకుండా అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు.
ఆ తర్వాత శృతి అంకిత దివ్యలు కూడా తినకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అనసూయ కూడా బాధపడి ఎమోషనల్ అయ్యి అక్కడ నుంచి తినకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు అభి లాస్య మీద సీరియస్ అవుతాడు. మరొక వైపు తులసి తన కుటుంబం గురించి తలుచుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోనే తులసి వాళ్ళ అమ్మ రావడంతో తులసి వాళ్ళ అమ్మతో కొద్దిసేపు నవ్వుతూ మరి కొద్దిసేపు ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది.
మరొకవైపు దివ్య తులసిని తలుచుకొని ఎమోషనల్ అవుతూ ఉండగా ఇంతలో అక్కడికి లాస్య వచ్చి ఎవరికి కాల్ చేస్తున్నావు దివ్య అని అడగగా ఎవరికి చేస్తే నీకెందుకు నన్ను మాట్లాడించకు అని సీరియస్ అవుతుంది దివ్య. అప్పుడు అది కాదు దివ్య అని అనడంతో నన్ను అడిగే హక్కు నీకు లేదు అని అనగా ఇంతలోనే అనసూయ నాకు ఉంది. ఇకపై నువ్వు ఆ తులసికి ఫోన్ చేయడానికి వీలు లేదు అని అంటుంది. అప్పుడు అనసూయ మీద సీరియస్ అవుతుంది దివ్య.
వెంటనే అనసూయ మీ అమ్మ లాగా నోరు చేస్తే తగ్గుతాను అనుకుంటున్నావా దివ్య అని అంటుంది. ఇప్పుడు దివ్య తన తల్లికి ఫోన్ చేయాలి అనుకుంటున్నాగా అనసూయ ఫోన్ లాక్కోని ఇక నుంచి వెళ్ళిపో అని అంటుంది. మరొకవైపు తులసి తన తల్లి ఒడిలో పడుకుని నిద్రపోతూ ఉండగా ఒక్కసారిగా దివ్య గురించి తెలుసుకుని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. తులసి వాళ్ళ అమ్మ తులసి కి నచ్చ చెబుతుంది.
మరుసటి రోజు ఉదయం దివ్య చదువుకుంటూ ఉండగా పరంధామయ్య పేపర్ చదువుతూ తులసి కాఫీ ఇవ్వు అని రెండు మూడు సార్లు అనడంతో వెంటనే దివ్య అక్కడికి వెళ్లి తాతయ్య అమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విషయాన్ని మరిచిపోయారు అని అంటుంది. అప్పుడు పరంధామయ్య బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎక్కడికి తాతయ్య అని అనగా కాఫీ పెట్టుకోవడానికి వెళుతున్నాను దివ్య అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.