Director Raghavendra Rao : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పేరు చివర B.A సెంటిమెంట్ గురించి తెలుసా? డైరెక్టర్ అవ్వకుంటే ఏమయ్యేవారంటే?

Director Raghavendra Rao : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (K. Raghavendra Rao) గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎన్నో హిట్ మూవీలకు దర్శకుడిగా వ్యవహరించారు. అద్భుతమైన మూవీలతో తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవేంద్ర.. రాఘవేంద్రరావు మూవీలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. సాధారణంగా రాఘవేంద్ర రావు తీసిన చాలా సినిమాల్లో బొడ్డుపై పండు అనేది పెట్టింది పేరు.

Director Raghavendra Rao _ Legendary Director Raghavendra Rao Reveals his Real Life Story

రొమాంటిక్ మూవీలను తీయడంలో ఈయనకంటే మరొకరు సాటిరారు. అలాగే భక్తిపరమైన మూవీలను కూడా దర్శకేంద్రుడికే సాధ్యం.. ఆయన తీసిన అన్నమయ్య, శ్రీరామదాసు మూవీలతో మెప్పించారు. రాఘవేంద్ర రావు మూవీలకు అనేక అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం ఆయన మూవీలు తీయడం లేదు. ఇటీవలే వాంటెడ్ రొమాంటిక్ మూవీతో ముందుకువచ్చారు. ఈ మూవీకు కూడా ఫుల్ రెస్పాన్స్ వచ్చింది.

Director Raghavendra Rao : దర్శకేంద్రుడు B.A అని ఎందుకు ఉండేదంటే?

వాంటెడ్ పండుగాడు మూవీకి సంబంధించి ప్రమోషన్స్ సందర్భంగా దర్శకేంద్రుడు అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రాఘవేంద్ర రావు తీసిన మూవీలను చూస్తే.. సినిమా టైటిల్స్ పడే సమయంలో దర్శకుడు రాఘవేంద్రరావు బి.ఎ అని ఉంటుంది. ఇంతకీ పేరు తర్వాత డిగ్రీ ఎలా వచ్చిందో కూడా చెప్పుకొచ్చారు. ఒకవేళ తాను డైరెక్టర్ కాకుంటే మాత్రం డ్రైవర్ గా సెటిల్ అయి ఉండేవాడినని రాఘవేంద్రరావు తెలిపారు. ఆ రోజుల్లో బీఏ చదివిన వాళ్ల కన్నా ఎక్కువ సంపాదన డ్రైవర్లకే వచ్చేదట..

Director Raghavendra Rao _ Legendary Director Raghavendra Rao Reveals his Real Life Story

అందుకే తాను డ్రైవర్ కావాలని అనుకున్నారట.. ఎందుకు డ్రైవర్ కావలనుకున్నారంటే.. తనకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. ఇంతకీ పేరు చివర బీఏ ఎందుకు పెట్టారంటే.. అలా పెట్టిన రెండు మూవీలు సూపర్ హిట్ అయ్యాయి. అదే సెంట్‌మెంట్ అన్ని సినిమాల్లోనూ కొనసాగించానని తెలిపారు. తాను తీసిన ఓ సినిమాకు బీఏ అని పెట్టలేదట.. ఆ మూవీ ప్లాప్ అయింది. అందుకే తన పేరు పక్కన బీఏ పెట్టుకుంటున్నానని చెప్పుకొచ్చారు.

Read Also : Brahmani Lokesh Marriage : కొత్తగా పెళ్లైన రోజుల్లో బ్రహ్మణి, నారా లోకేశ్ ఎంత క్యూట్‌గా ఉన్నారో చూడండి.. వీడియో వైరల్!

Recent Posts

Diwali 2024 : లక్ష్మీదేవీకి ఎంతో ఇష్టమైన ఈ పువ్వు ఏడాదిలో 2 రోజులు మాత్రమే కనిపిస్తుంది.. దీపావళి పూజలో ప్రత్యేకమైనది..!

Diwali 2024 : దీపావళి పండుగ రోజున మహాలక్ష్మి దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పూజలో తామర…

1 week ago

Paneer Mughalai Dum Biryani : నోరూరించే పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యాని.. ఇలా చేశారంటే చికెన్ బిర్యానీ కన్నా టేస్ట్ అదిరిపొద్ది..!

Paneer Mughalai Dum Biryani : పన్నీర్ ముఘలాయ్ ధమ్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా? అయితే, ఇప్పుడు ఓసారి ట్రై…

4 weeks ago

Kidney Stones : శరీరంలో నీరు తగినంత లేకుంటే ఈ ప్రాణాంతక వ్యాధి వస్తుంది జాగ్రత్త.. రోజుకు ఎంత నీరు తాగాలంటే?

Kidney Stones : నీరు జీవనాధారం.. నీరు లేకుండా ఏ జీవి కూడా బతకలేదు. ఈ మాటను చిన్నప్పటినుంచి వినే…

4 weeks ago

Senior Actress : కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు ఇచ్చేసిన ప్రముఖ సినీనటి ఎవరంటే?

Senior Actress : వెండితెరపై ఎందరో బాలనటులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నటులుగా రాణించారు. సినిమా పరిశ్రమలో…

1 month ago

Gold Rate Silver Rate Today : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. పసిడి ప్రియులకు పండుగే.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Gold Rate Silver Rate Today : బంగారం కొంటున్నారా? కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. బంగారం కొంటే ఇప్పుడే కొనేసుకోవడం…

9 months ago

Uric Acid Cause Gout : మన శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలను తగ్గించుకోండిలా? లేదంటే అంతే సంగతులు..

Uric Acid cause Gout : మనిషి తను తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అవసరమైన మేర శక్తి లభిస్తుంది.…

10 months ago

This website uses cookies.