Guppedantha Manasu june 7 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉండగా రిషి కి యాక్సిడెంట్ అవుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో వసుధార ఆటోలో వెళుతూ రిషి సార్ సాక్షి తో కలిసి వెళ్తుంటే నాకెందుకు కోపం వచ్చింది అని మనసులో ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇక వసుధార వెళ్తున్నా రోడ్డులో జనాలు అంత గుమిగూడి ఉండడంతో ఆటో డ్రైవర్ ఆటో ని ఆపగా ఇంతలో వసు అక్కడ ఉన్న వ్యక్తిని ఏం జరిగింది అని అనగా యాక్సిడెంట్ అని చెప్పడంతో వెంటనే వసు అక్కడికి వెళ్లి చూడగా యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో రిషి ఉండటం చూసి షాక్ అవుతుంది ఏడుస్తూ హాస్పిటల్ కి తీసుకొని వెళుతుంది.
మరొకవైపు మహేంద్ర అందరూ ఇంట్లో రిషి గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలోనే వసు మహేంద్ర కి ఫోన్ చేసి అర్జెంటుగా మీరు ఇంటి బయటికి రండి సార్ అని పిలుస్తుంది. ఇక మహేంద్రవర్మ అక్కడికి వెళ్లి చూడగా రిషి కి గాయాలు అవ్వడం చూసి మహేంద్ర ఫ్యామిలీ మొత్తం టెన్షన్ పడతారు. ఏం జరిగింది వసు అని అడగగా యాక్సిడెంట్ అయింది అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.
ఆ తర్వాత రిషిని ఇంట్లోకి తీసుకొని వెళ్లి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అప్పుడు డాక్టర్ చెప్పారు అని ధరణి వేడి నీళ్ల కోసం కిందికి వెళ్లగా అప్పుడు దేవయాని ఏం జరిగింది ధరణి అంత హడావిడి గా ఉన్నావు అని అడగగా రిషి కి యాక్సిడెంట్ అయింది అని అనడంతో దేవయాని ఒక్కసారిగా షాక్ అవుతుంది.
ఇంతలోనే వసు ఇంట్లోకి వస్తుండడంతో అది చూసిన దేవయాని గుమ్మం దగ్గర నిల్చుని వసు ని లోపలికి రావద్దు అని అడ్డుకుంటుంది. ఇక వసుధార అప్పుడు ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత దేవయాని రిషి దగ్గరికి వెళ్లి దొంగ ప్రేమలు చూపిస్తుంది. ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయినా కూడా జగతి మాత్రం అక్కడే ఉండి రిషి ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది.
ఆతర్వాత దేవయాని సాక్షి కి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పి దీనిని ఆసరాగా తీసుకుని రిషికి మరింత దగ్గర అవ్వు సలహా ఇస్తుంది. రేపటి ఎపిసోడ్ లో వసుధార గుడికి వెళ్లి స్వామి దగ్గర కుంకుమ తీసుకొని రిషి ఇవ్వడం కోసం ఇంటికి వస్తుంది. కానీ దేవయాని మాత్రం లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. అప్పుడు బయటికి వచ్చిన రిషి వసు ను చూసి ఒక్క సారిగా వసుధార అని ప్రేమతో పిలుస్తాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Tufan9 Telugu News And Updates Breaking News All over World