Karthika Deepam serial Oct 1 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. గత ఎపిసోడ్ లో దుర్గ,మోనిత గురించి కార్తీక్ తో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో దుర్గా నేను బయట ఉంటాను అని వెళ్తూ ఉండగా అప్పుడు కార్తీక్ అడ్డుపడి పర్లేదు దుర్గ,మోనిత ఫ్రెండ్ అంటున్నావ్ కదా తన కోపం గురించి తెలిసిందే కదా కాబట్టి మీరు మీ బిజినెస్ పని అయిపోయే వరకు ఇక్కడే ఉండండి అని కార్తీక్ అనడంతో మోనిత షాక్ అవుతుంది. మరి లగేజ్ ఏది అని కార్తీక్ అడగగా తీసుకు వస్తాను సార్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు దుర్గ.
ఆ తర్వాత మోనిత,దీప మీద కోపడుతూ వాడిని పిలిపించి మీరిద్దరూ కలిసి ఏం డ్రామాలు వాడుతున్నారే అంటూ కోప్పడుతూ ఉంటుంది. అప్పుడు దీపా మౌనితకు తగిన విధంగా బుద్ధి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు హిమ, సౌందర్య ఇద్దరు కారులో వెళుతూ ఉండగా అప్పుడు సౌందర్య,హిమ బాధను చూసి మరింత బాధపడుతూ ఉంటుంది.
సౌర్య దీని బాధను అర్థం చేసుకోవచ్చు కదా అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఎద్దులు కలిసి సరదాగా మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటారు. మరొకవైపు దీప,దుర్గ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు దుర్గ నేను ఏ నిజం ఎప్పుడు బయటపెడతానో అని ఆ మోనిత భయంతో టెన్షన్ పడుతూ ఉంటుంది అని అనగా వెంటనే దీప భయపడితే సరిపోదు దుర్గ కాస్త డోస్ పెంచాలి అని అంటుంది దీప.
అది పెద్ద కిలాడి నువ్వు ఏం చేసినా మనిద్దరం కలిసే చేసాము అని అనుకుంటుంది కాబట్టి ఆ భయం కొద్ది రోజులు మాత్రమే అని చెబుతుంది దీప. అప్పుడు దుర్గ ఏం చేయాలి దీపమ్మ అని అనగా దీప ఒక ప్లాన్ చెబుతుంది. మరొకవైపు మోనిత, దుర్గ గురించి తలుచుకొని జాగ్రత్తగా ఉండాలి లేదంటే కార్తీక్ అనుమానం వస్తుంది అని భయపడుతూ ఉంటుంది. ఇంతలోనే కార్తీక్ అక్కడికి వచ్చి ఎందుకు అతన్ని అవమానించావు అని మాట్లాడుతూ ఉండగానే ఇంతలోనే అక్కడికి దుర్గ వస్తాడు.
అప్పుడు మీ ఫ్రెండ్ వచ్చాడు కదా మోనిత ఏదైనా వెళ్లి స్పెషల్ వంటకం చెయ్యి అని అనటంతో వెంటనే దుర్గ సార్ మీ పెళ్లి అయ్యి నాలుగేళ్లు అయి ఉంటుంది కానీ నాకు మోనిత సంవత్సరం పాటు వండిపెట్టింది అనటంతో మోనిత షాక్ అవుతుంది. అప్పుడు మోనిత మీద దుర్గ లేనిపోనివన్నీ చెబుతూ ఉండడంతో మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు మోనిత దుర్గా మీద సీరియస్ అవుతుంది. అప్పుడు కార్తీక్,దీప ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే దీప వారికీ భోజనం తీసుకుని వస్తుంది.
అప్పుడు మోనిత వాడు చెప్పేదంతా అబద్ధం అని అనడంతో వెంటనే దుర్గ నువ్వు అలా మాట్లాడకు మోనిత మన మధ్య జరిగిన అని చెప్పాల్సి వస్తుంది అనడంతో మోనిత షాక్ అవుతుంది. అప్పుడు కార్తీక్,దుర్గ,మోనిత ల మీద అనుమాన పడతాడు. అప్పుడు మోనిత, దీప మీద సీరియస్ అవ్వగా దీప స్వీట్ గా వార్నింగ్ ఇస్తుంది. ఇంతలోనే అక్కడికి కార్తీక్ వస్తాడు. అప్పుడు కార్తీక్ మనం లోపలికి వెళ్దాం పద అని అనగా వెంటనే దీప ఇలా అన్ని దాచి మోనిత టెన్షన్ పడుతోంది డాక్టర్ బాబు అని అనగా ఏం జరిగింది అని అంటాడు కార్తీక్.
అప్పుడు దీప,దుర్గ గురించి కార్తీక్ బాబుకి ఏమైనా చెప్పాలి అనుకుంటే ముందే చెప్పి మనస్పర్ధలు రాకుండా ఉంటాయి అని అడ్డంగా ఇరికిస్తుంది దీప. దాంతో మోనిత మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ చెప్పమనీ అనడంతో లోపల భయంగా ఉన్న పైకి నవ్వుతూ మాట్లాడిస్తుంది మోనిత. అప్పుడు దుర్గ వచ్చి వంటలక్క ఇంటిదగ్గర ఉండడంతో వంటలక్క దానిని కొద్దిసేపు కూడా మన శాంతిగా ఉంచవద్దు మళ్లీ వెళ్లి టెన్షన్ పెట్టు అని రెచ్చగొట్టి అక్కడికి పంపిస్తుంది.
ఆ తర్వాత మోనిత ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే దుర్గ అక్కడికి వచ్చి బంగారం అంటూ మోనిత నీ మాట్లాడిస్తూ ఉంటాడు. అప్పుడు మోనిత వార్నింగ్ ఇస్తూ ఉండగా దుర్గ మోనిత చెయ్యి పట్టుకుంటాడు. ఇంతలోనే కార్తీక్ అది చూసి మోనిత ను అపార్థం చేసుకుంటాడు. ఇక కార్తీక్ అక్కడ్నుంచి దీప వాళ్ళ దగ్గరికి వెళ్లి బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి శివ వచ్చి సర్ మేడం గారు మిమ్మల్ని అలా రెండు గంటలసేపు బయట తిప్పి తీసుకొని రమ్మన్నారు కార్తీక్ షాక్ అవుతాడు.
Rythu Bharosa : తెలంగాణ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. రైతు భరోసా డబ్బులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.…
Jeera Saunf water : మీ ఇంటి వంటగదిలో సులభంగా లభించే అనేక దినుషుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని…
CBSE Admit Card 2025 : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2025 బోర్డు పరీక్షలకు అడ్మిట్…
NPS Zero Tax : మీరు వేతనజీవులా? ప్రతినెలా జీతం పొందే వ్యక్తి అయితే.. మీకో గుడ్ న్యూస్.. బడ్జెట్…
Vitamin E deficiency : శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని విటమిన్లు, ఖనిజాలు అవసరం. ఏదైనా విటమిన్ లోపం ఉంటే..…
Lungs Detox : ఊపిరితిత్తులను శుభ్రపరిచే మార్గాలివే : ప్రస్తుత మన జీవనశైలి.. మన ఊపిరితిత్తులపై చాలా చెడు ప్రభావాన్ని…
This website uses cookies.