Telugu NewsLatestKarthika Deepam Final Episode : మోనితని చంపేసిన వంటలక్క.. ప్రమాదం నుంచి బయటపడిన దీప,...

Karthika Deepam Final Episode : మోనితని చంపేసిన వంటలక్క.. ప్రమాదం నుంచి బయటపడిన దీప, కార్తిక్?

Karthika Deepam Final Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత మోనిత, దీప మాటలకు సంతోషపడుతూ ఉంటుంది.

Advertisement

ఈరోజు ఎపిసోడ్ లో మోనిత సంతోష పడుతూ ఉండగా అప్పుడు దీప మోనిత చేతిలో ఉన్న తుపాకిని లాక్కోవడంతో నన్ను ఇంత మోసం చేస్తావా అనడంతో దగ్గరికి రావద్దు చంపేస్తాను అంటుంది దీప. అత్తయ్య పిల్లలను తీసుకొని వెళ్లిపోండి అనగా దీప ముందు చేతిలో ఉన్న గన్ కింద పడేయ్ అనడంతో డాక్టర్ బాబు నేను చెప్పింది చేయండి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనడంతో సౌందర్య కార్తీక్ వాళ్ళు కిందికి వెళ్లి పోతారు . కార్తీక్ సౌందర్య వాళ్లకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. నా డాక్టర్ బాబు కావాలా ఎన్ని సార్లు చెప్పినా నీ బుద్ధి మారదా నిన్ను చంపేస్తాను అనగా మోనిత నవ్వుకుంటూ గరిట పట్టుకున్న చేత్తో గన్ను పట్టుకున్నావు నువ్వు నన్ను ఏమి చేయగలవు అనడంతో చంపేయనా అని దీప అనగా మోనిత భయంతో వెనకడుగు వేస్తుంది.

Advertisement
Karthika Deepam Final Episode
Karthika Deepam Final Episode

నా భర్త ఎంత వద్దంటున్నా వెనుక పడుతున్నావు అనగా మొన్నటి వరకు నువ్వు కూడా నాలాగే కార్తీక్ వెంట పడ్డావు కదా దీపక్క నీ ప్రేమ మాదిరే నా ప్రేమ కూడా అంటుంది మోనిత. అప్పుడు దీప,మోనిత మాట్లాడుకుంటూ ఉండగా మోనిత సెట్ చేసిన బాంబు టైం అయిపోతూ ఉంటుంది. అప్పుడు మోనిత కావాలనే దీపని రెచ్చగొడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఆ దేవుడు లేడని అనుకున్నాను కానీ ఆ దేవుడు ఉన్నాడు నీలాంటి రాక్షసులను అంతమొందించడానికి నాలాంటి వారిని పుట్టించాడు. ఇక నిన్ను చంపడం లేట్ చేస్తే ఆ దేవుడికి కూడా కోపం వస్తుంది అని దీప మోనితను గన్ తో షూట్ చేస్తుంది.

Advertisement

తుపాకి శబ్దం విన్న కార్తీక్ లోపలికి పరుగులు తీస్తాడు. అప్పుడు ఎంత పని చేశావు దీప అంటూ మోనిత కింద పడిపోవడంతో అప్పుడు దీప కూడా గుండె నొప్పితో కింద పడిపోయి మోనిత వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. నాతో ఎంత పని చేయించావు మోనిత అనుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి కార్తీక్ వస్తాడు. అప్పుడు కార్తీక్ అక్కడికి వచ్చి మోనిత వైపు చూసి బాధపడుతూ గతంలో జరిగిన విషయాలు అన్నీ తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు దీపకి గుండె నొప్పి ఎక్కువ అవడంతో కార్తీక్,దీపని పిలుచుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు కళ్ళు తెరిచిన మోనిత కార్తీక్,దీపలను ఎలా అయినా చంపాలి అనుకొని కార్తీక్ వాళ్ళ కారులో బాంబు వేస్తుంది.

Advertisement

నాకు దక్కని కార్తిక్ ఎవరికి దక్కకూడదు ఐ లవ్ యు కార్తీక్ అని చనిపోతుంది మోనిత. మరొకవైపు సౌందర్య వాళ్ళు కార్లు వెళ్తూ ఉండగా అప్పుడు హిమ స్వారీ సౌర్య నేను ఇదంతా అమ్మ కోసమే చేశాను అనడంతో కారు ఆపు నానమ్మ అని కోపంగా ఉంటుంది సౌర్య. ఆ తర్వాత కారు దిగి సౌర్య వెళుతుండగా ఆగు సౌర్య ఎక్కడికి వెళ్తున్నావు అనడంతో నేను నీతో పాటు హిమ అంటుంది. అప్పుడు సౌందర్య ఎక్కడికి వెళ్తావు సౌర్య అని అడగడంతో అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతాను నానమ్మ వాళ్ళు నిజంగానే తిరిగి వస్తారా అని అడగగా సౌందర్య మౌనంగా ఉండడంతో ఈ హిమతో పాటు కలిసి నేను ఉండను.

Advertisement
deepa-kills-monitha-in-todays-karthika-deepam-serial-episode
deepa-kills-monitha-in-todays-karthika-deepam-serial-episode

నానమ్మ అనగా మీ అమ్మానాన్న చెప్పిన మాటలు మర్చిపోయావా అనడంతో నాకు అన్ని గుర్తున్నాయి నానమ్మ కానీ ఈ హిమతో కలిసి నేను ఉండను సౌర్య అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. అప్పుడు సౌందర్య వాళ్లు ఎంత పిలిచినా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు కార్తీక్ దీప ఇద్దరు కారులో వెళ్తూ ఉండగా అప్పుడు దీప డాక్టర్ బాబు నా చివరి క్షణాలు నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి నాకు ఊపిరి ఆడడం లేదు అనడంతో అలా మాట్లాడకు దీప అని అంటాడు కార్తీక్. హిమ, సౌర్య అత్తయ్య వాళ్ళను ఆఖరి చూసుకోకుండానే పంపించేశాను అని బాధపడుతూ ఉంటుంది దీప. కానీ మీరు మాత్రం నాతోనే ఉండిపోయారు నా ఆఖరి కోరికను మీరు తీరుస్తారు కదా డాక్టర్ బాబు అంటుంది దీప.

Advertisement

ప్లీజ్ నువ్వు ఏం మాట్లాడకు దీప అనుకుంటూ దీపకు ధైర్యం చెబుతూ ఉంటాడు కార్తీక్. నాకు చనిపోవాలని లేదు డాక్టర్ బాబు కానీ ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అని అంటుంది దీప. అప్పుడు నా ఆఖరి కోరిక తీరుస్తారు కదా డాక్టర్ బాబు ఒక్కసారి కారు ఆపండి అనడంతో నేను ఆపను దీప ఎలా నేను నిన్ను రక్షించుకుంటాను అని అంటాడు. అప్పుడు దీప ప్లీజ్ డాక్టర్ బాబు ఆకరి కోరిక మళ్లీ అడగడానికి నేను ఉండను అనడంతో కార్తీక్ తప్పక కారు ఆపుతాడు. అప్పుడు దీప
కార్తిక్ ఇద్దరు కారు దిగి అడుగులు అడుగు వేసుకుంటూ ఏడు అడుగులు నడుస్తారు.

Advertisement

కొద్ది ముందుకు వెళ్ళగానే ఇంతలోనే కారు పేలిపోవడంతో అదే చూసి కార్తీక్, దీప ఇద్దరు షాక్ అవుతారు. చూసావా దీప ఆఖరి క్షణాల్లో నీ ప్రాణం నన్ను కాపాడింది అనుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతారు కార్తీక్ దీప. మరొకవైపు సౌందర్య వారణాసి మాట్లాడుకుంటూ ఉండగా పలు కావాలనే కనిపించకుండా దూరం వెళ్ళిపోయారు వారణాసి అలాంటప్పుడు ఎందుకు కనిపిస్తారు అనడంతో కారు పెరిగిపోయినప్పుడు దీపమ్మ, కార్తీక్ బాబు ఆడవాళ్లు కనిపించలేదు అనడంతో అంటే ఏదో కుట్ర చేసింది అందుకే నా కొడుకు కోడలు ఆ కారు ప్రమాదం నుంచి తప్పించుకుని బయటపడ్డారు అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు కార్తీక్ దీప ఇద్దరు ఒకచోట కూర్చుని గతంలో జరిగిన విషయాలు అన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటారు. అలా మొత్తానికి డాక్టర్ బాబు వంటలక్క ఇద్దరు ఒకటవుతారు.

Advertisement

Read Also : Shocking Video : వామ్మో.. మొసలితో సయ్యాటలా? చివరికి ఏమైందో చూడండి.. షాకింగ్ వీడియో..!

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు