...

Cuddle Therapy : అతని కౌగిలిలో బందీ కావాలంటే గంటకు 7000 చెల్లించాల్సిందే..?

Cuddle Therapy : ప్రస్తుత కాలంలో మనిషి అవసరాలను బట్టి సులువైన మార్గంలో డబ్బు సంపాదించడానికి ఎన్నో కొత్త విధానాలను కనిపెడుతున్నారు. బ్రిటన్ కి చెందిన టీజర్ అనే వ్యక్తి వినూత్న పద్ధతిలో ప్రజలకు సేవలు అందిస్తూ సులువైన పద్ధతిలో గంటకు 7000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అసలు విషయానికి వస్తే.. ప్రస్తుత కాలంలో ఈ బిజీ లైఫ్ లో కొందరు ఇతరులతో సాన్నిహిత్యంగా ఉండలేక తమ మనసులో ఉన్న భావాలను ఇతరులతో పంచుకోలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా ఎంతోమంది ప్రజలకు నేనున్నాను అంటూ ధైర్యం చెబుతూ వారికి ఊరటనిస్తూ ట్రెజర్ అటువంటి వారికి తన సేవలను అందిస్తున్నాడు.

cuddle-therapy-makes-people-calm-and-safe-professional-cuddler-charges-7-thousand-per-hour-long-
cuddle-therapy-makes-people-calm-and-safe-professional-cuddler-charges-7-thousand-per-hour-long-

ఒంటరితనంతో ఇబ్బంది పడేవారు గంటకు 7 వేలు చెల్లించి అతడి కౌగిలిని కోరుకుంటున్నారు. ఇలా ఒంటరితనంతో ఇబ్బంది పడుతున్న వారిని అతడు ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని నేనున్నానంటూ భరోసా కల్పించే కౌగిలి(Hug) ఇస్తాడు. ఎవరికైనా ఏ క్షణంలోనైనా ఒంటరిగా ఉన్నామన్న భావన వచ్చినప్పుడు అతడిని సంప్రదిస్తే చాలు.. నేనున్నానంటూ రెక్కలు కట్టుకుని వాలిపోతాడు. భుజాలపై చేయి వేసి దగ్గరకు తీసుకుంటాడు.. తల నిమురుతూ మనసులోని ఆందోళన తగ్గేలా తన కౌగిలితో మ్యాజిక్ చేస్తాడు. ఇలా తన సాన్నిహిత్యంతో అందరి ఒంటరితనాన్ని దూరం చేస్తున్న ట్రెజర్ కి ఇది అకస్మాత్తుగా వచ్చిన ఆలోచన కాదు.

ట్రెజర్ లాంటి వాళ్లు ఎంతోమంది ఈ పనిని ఒక వృత్తి భావిస్తారు. వీరు చేసే పనిని కడల్ థెరపీ అని అంటారు. ట్రెజర్ లాంటి వారిని ప్రొఫెషనల్ కడలర్స్ అంటారు. తమ వ్యక్తిగత సమస్యల కారణంగా కొంతమంది మానసికంగా ఇతరులకు దగ్గర కాలేక ఇబ్బంది పడుతూ ఉంటారు . అలాంటి వారికి నేను ఈ కడల్ థెరపీ ఇస్తుంటాను అని ట్రెజర్ తెలియచేశాడు. ఇది కేవలం కౌగిలింత మాత్రమే కాదు. వారు కోరుకున్న స్నేహాన్ని, ఓ వ్యక్తి మనకు తోడున్నాడన్న భావనను కల్పించే ప్రయత్నం. కొత్త వ్యక్తులను కలిసిన ప్రతిసారీ కడల్ థెరపీకి సంబంధించిన నియమనిబంధనలు వారికి వివరిస్తుంటా అని ట్రెజర్ వెల్లడించాడు. ఈ కడల్ థెరపీ ద్వారా ట్రెజర్ ఒంటరితనంతో బాధడుతున్న వారికి తన కౌగిలితో వారి భాధని దూరం చేస్తున్నాడు.