Comedian Ali : టాలీవుడ్ వెండితెరపై నవ్వుల పువ్వులు పూయించిన అతి కొద్ది మంది మోస్ట్ ట్యాలెంటెడ్ కమెడియన్లలో అలీ ఒకరు. బాల నటుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టిన అలీ, వేలాది సినిమాలు చేసి అలరించారు. అప్పట్లోనే హీరో పలు సినిమాలు చేశారు అలీ. అవి చాలా పెద్ద హిట్ కూడా అయ్యాయి. ఇక తన కామెడీ టైమింగ్ తో ఓ వెలుగు వెలిగారు అలీ. ఇదిలా ఉంటే త్వరలీ అలీ కూతురు వివాహంం జరగనుంది.
ఈ క్రమంలో అలీ కుమార్తె నిశ్చితార్థానికి సంబంధించిన వీడియోను తన భార్య జుబైదా తన యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేసింది. ప్రస్తుతం నిశ్చితార్థానికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక అలీ కుటుంబ విషయానికి వస్తే.. అలీ భార్య పేరు జుబేదా. ఆయనకు మొత్తం ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు కూతుళ్లు కాగా ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె పేరు ఫాతిమా రెమీజున్ కాగా.. ఆమె ఇటీవల మెడిసిన్ కంప్లీట్ చేసింది. అలీ రెండో కూతురి పేరు జువేరియా. అలీ కొడుకు పేరు మొహమ్మద్ అబ్దుల్ సుభాన్. అయితే ఇప్పుడు అలీ పెద్ద కూతురు ఫాతిమా రెమీజున్ కు ఎంగేజ్మెంట్ జరిగింది . ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ నుండి పెద్దలు హాజరు అయ్యారు. బ్రహ్మానందం, సాయికుమార్ తో పాటు ఇతర నటీనటులు హాజరయ్యారు.