Shraddha Comments: అనసూయ భరద్వాజ్.. హీరో విజయ్ దేవరకొండపై చేసిన కామెంట్ల వల్ల ట్రోల్స్ కు గురవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈమెకు మద్దతుగా నిలిచేందుకు వచ్చిన నటి శ్రద్ధా కపూర్ కూడా ప్రస్తుతం ట్రోల్స్ కు గురవుతున్నారు. అనసూయతో పాటుగా ఈమెను కూడా ఓ ఆట ఆడేస్కుంటున్నారు రౌడీ బాయ్ ఫ్యాన్స్. అయితే అసలేమైందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అనసూయని విజయ్ దేవరకొండ అభిమానులు ఆంటీ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. రెండు రోజులుగా ఆంటీ హ్యాష్ ట్యాగ్ తో బాగా ట్రెండ్ చేస్తున్నారు. మీమ్స్ క్రియేట్ చేస్తూ.. అనసూయను ఉడికించే ప్రయత్నం చేస్తున్నారు. అనసూయ కూడా ఎక్కడా ఏమాత్రం తగ్గడం లేదు. తనను ట్రోల్ చేసే వారికి తనదైన స్టైల్ లో సమాధానం చెప్తూ.. ముందుకు సాగుతోంది. అనసూయ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుండగా.. మధ్య శ్రద్ధా వచ్చి అడ్డంగా బుక్కైంది.
నేనెవరికీ ఆంటీని కాను..25 ఏళ్లు వచ్చి పిల్లల్ని కంటే ఆంటీలో ఐపోతారా అంటూ ట్వీట్ చేసింది అనసూయ. దీనిపై స్పందిస్తూ.. శ్రద్ధా దాస్ కామెంట్ చేశారు. మీ వయసు కంటే సగం వయసు ఉన్న వారికంటే మీరే హాట్ గా ఉన్నారంటూ రిల్పై ఇచ్చింది. మీ ఏజ్ కటే డబుల్ ఏజ్ ఉన్న అంకుల్స్ కంటే కూడా మరింత హాట్ గా ఉన్నారు.. అందుకే మీరంటే నాకిష్టమంటూ కామెంట్లు చేసింది. దీంతో ఈమెను కూడా నెటిజెన్లు ఓ ఆట ఆడేస్కుంటున్నారు.