Chanakya Niti : ధనం మూలం ఇదం జగత్ అన్నారు. అన్నింటికీ ధనమే మూలము అని దీని అర్థం. ప్రపంచంలో డబ్బుకు లొంగని వారంటూ ఉండరు. డబ్బు మీద వ్యామోహంతో ఎవరు ఇలాంటి పనులు చేసినా చివరికి దక్కేది మాత్రమే దక్కుతుంది. అత్యాశ పడినంత మాత్రాన దాన్ని సొంతం కాదు. డబ్బు సంపాదించాలంటే చాలా కష్టపడాలి. అదే డబ్బులు తిరిగి ఖర్చు పెట్టాలంటే సునాయాసంగా చేయవచ్చు. డబ్బు సంపాదన కి ఎంత కష్టపడతాము ఖర్చుకి అంతే ఆలోచిస్తాము. అప్పనంగా వచ్చిన సంపాదన మాత్రం విచ్చలవిడిగా ఖర్చవుతుంది. ఆగాన వచ్చింది బోగాన పోతుందని సామెత.
chanakya-niti-money-making-tips
డబ్బు సంపాదించడం అంటే అంత సులువైన పని కాదు. దానికి ఎంతో శ్రమ పడాలి కష్టపడితేనే డబ్బు మన చేతికి వస్తుంది. ఖర్చు పెట్టే ముందు బాగా ఆలోచించాలని ఆచార్య చాణిక్యుడు చెబుతున్నాడు. డబ్బు విషయంలో పొదుపు పాటించాలని లేకపోతే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నాడు. ఏది అవసరమో దానికే ఖర్చు పెట్టాలి. అంతేకానీ అనవసరమైన వాటికి ఖర్చు చేసి చిక్కుల్లో పడకూడదు. జీవితంలో పొదుపు లేకపోతే అనేక కష్టాలు పడాల్సి వస్తుంది.
అందుకే సంపాదించిన మొత్తాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా కొంచెం పొదుపు చేస్తే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది. సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు చేయడంలో అంతే ఆలోచన చేసి పొదుపు చేయడం ఉత్తమం. డబ్బు విషయంలో అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అందుకోసం నిరంతరం శ్రమించాల్సి ఉంటుందని తెలుసుకోవాలి. ఆపద కాలంలో డబ్బు ఎంతగానో సహాయం చేస్తుంది. ఏ రోగం వచ్చినా ఆదుకునేది డబ్బే అని గ్రహించుకోవాలి.
డబ్బు పొదుపు చేస్తే త్వరగా ధనవంతులవుతారని చాణక్యుడు వివరించాడు. డబ్బు స్నేహితుడిగా ఆదుకుంటుంది రక్షణగా ఉంటుంది. అందుకే డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తే అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. దాచుకుండ చేస్తే అనేక ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. దాచుకుంటే భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడుతుంది. త్వరలో ధనవంతులు కావాలంటే పొదుపు ఒక్కటే సరైన మార్గమని ఆచార్యుడు ఆనాడే చెప్పడం గమనార్హం.
Read Also : Chanakya Niti : ఇలాంటి తప్పులు చేస్తే.. జీవితంలో అసలే ఎదగలేరంట..!