...

Moringa Juice for Diabetes : ఈ ఆకుల రసం తాగితే.. మందులు వాడకపోయినా షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది.

Moringa Juice for Diabetes : ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకారం భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యల లో డయాబెటిస్ కూడా చేరింది. రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గుల కారణంగా డయాబెటిక్ రోగులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. డయాబెటిస్ పేషంట్స్ రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ మందులని ప్రతిరోజు వాడుతూ ఉండాలి. మందులే కాకుండా కొన్ని రసాలు సేవించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

moringa-juice-for-diabetes-health-benefits-in-telugu
moringa-juice-for-diabetes-health-benefits-in-telugu

శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు విపరీతమైన దాహం, ఆకలి, చూపు మందగించడం, అలసట, చికాకు, గాయాలు త్వరగా మానకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డయాబెటిస్ ను కంట్రోల్లో ఉంచకపోతే గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, కంటి సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

తిప్పతీగ : తిప్పతీగ డయాబెటిస్ పేషెంట్ కి మంచి ఔషధంలా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే లక్షణాలు తిప్పతీగ లో ఉన్నాయని NCBI వెల్లడించింది. ఇక ప్రతిరోజూ తిప్పతీగ రసం తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది అని చెప్పవచ్చు.

అశ్వగంధ : అశ్వగంధ ను అనేక వ్యాధులను నయం చేయడంలో ఉపయోగిస్తారు. అశ్వగంధ ఆకుల రసాన్ని లేదా టాబ్లెట్ల రూపంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

కలబంద : షుగర్ పేషంట్స్ కు కలబంద మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఈ రోజు ఈ రసాన్ని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించుకోవచ్చు.

వేప ఆకు : షుగర్ పేషెంట్స్ వేప ఆకు గాని వేప రసాన్ని గాని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిని తగ్గించుకోవచ్చు. ఇది షుగర్ పేషెంట్ కు మంచి ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మునగ ఆకు : మునగ ఆకు లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. శరీరంలో చక్కెర స్థాయిని తగ్గించే లక్షణాలు మునగాకులో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక మునగ ఆకు పొడిని గాని, మునగాకు టీని తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. దీన్ని టాబ్లెట్ల రూపంలో కూడా తీసుకోవచ్చు.

Read Also : health tips : బాదం పొట్టుతో కలిపి తింటే కలిగే ప్రయోజనాలు..