Telugu NewsLatestBigg Boss OTT : బిగ్ బాస్ ఓటీటీకి సర్వం సిద్దం... లీకైన కంటస్టెంట్స్ లిస్ట్...

Bigg Boss OTT : బిగ్ బాస్ ఓటీటీకి సర్వం సిద్దం… లీకైన కంటస్టెంట్స్ లిస్ట్ !

Bigg Boss OTT : తెలుగు బుల్లితెరపై ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకాదరణను అందుకుని బిగ్గెస్ట్ రియాలిటీ షోగా నిలిచింది ” బిగ్ బాస్ “. తక్కువ సమయంలోనే విశేషమైన రెస్పాన్స్‌ను దక్కించుకుని సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది ఈ షో. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకోని త్వరలోనే కొత్త సీజన్ కు రెడీ అవుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌తో నిర్వహకులు సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. దీనికి కూడా అక్కినేని నాగార్జునే హోస్టుగా చేయబోతున్నారు.

Advertisement

ఫిబ్రవరి 20 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో బిగ్‌బాస్‌ షో స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి ప‌లు వివ‌రాలు లీక్ అవుతున్నాయి. గ‌తంలో బిగ్‌బాస్‌లో అల‌రించిన వారిని కూడా ఈ సారి మ‌ళ్లీ తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే పలువురు మాజీ కంటెస్టెంట్లను తీసుకున్నారని స‌మాచారం. వారిలో అరియానా గ్లోరీ కూడా ఉంద‌ని తెలుస్తోంది. ఆమెతో పాటు మాజీ కంటెస్టెంట్స్‌ ఆదర్శ్, తనీశ్‌, అఖిల్, అలీ రెజా, హరితేజను కూడా ఈ సారి బిగ్‌ బాస్‌ లోకి తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement

కొత్త‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌నున్న వారిలో యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ శివ, ఢీ-10 విజేత రాజు, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్’వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ వైష్ణవి, సోషల్‌ మీడియా స్టార్‌ వరంగల్‌ వందన, యాంకర్‌ ప్రత్యూష కూడా ఈ సారి బిగ్‌బాస్‌లో అల‌రించనున్న‌ట్లు స‌మాచారం. మొత్తం 82 రోజుల పాటు సాగనుందని తెలుస్తోంది. ఇక, ఇందులో 15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు