...

Ariyana glory : బిగ్ బాస్ విన్నర్ ఎవరో తనకు ముందే తెల్సట.. అరియానా షాకింగ్ కామెంట్లు!

Ariyana glory : రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో తనకంటూ కొంచెం పాపులారిటీని సంపాదించుకున్న బోల్డ్ యాంకర్ అరియానా గ్లోరీ.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సీజన్ కి బిగ్ బాస్ బజ్ లో ఇంటర్వ్యూలోకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ గా మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. గతంలో లాగే ఓటీటీ సీజన్ లోనూ టాప్ 4గా నిలిచి తన స్థానాన్ని కాపాడుకుంది. అయితే గతంలో ఎలంటి ప్రైజ్ మనీని పొందని అరియానా ఓటీటీలో మాత్రం 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందుకుంది. అయితే బిగ్ బాస్ ఓటీటీలో విన్నర్ ఎవరో ఫ్యామిలీ వచ్చినప్పుడే తనకు అర్థం అయిందని చెప్పింది.

Ariyana glory
Ariyana glory

బిగ్ బాస్ లోకి రెండో సారి వచ్చినప్పుడే కొత్త వాళ్లు విన్నర్ కావాలని కోరుకున్నట్లు వివరించింది. కానీ ఆ విషయాన్ని తానెప్పుడూ బయట పెట్టలేదని.. మొదటి సారి బిగ్ బాస్ కు వచ్చినప్పుడు తాను గెలిచేందుకు వాడానని పేర్కొంది. ఓటీటీలో మాత్రం ఎవరైనా అమ్మాయి గెలిస్తే బాగుండని కోరుకున్నట్లు చెప్పింది. తాను అనుకున్నట్లుగానే బిందు మాధవి గెలిచిందని అరియానా స్పష్టం చేసింది. గతంలో తాను తరచుగా బిగ్ బాస్ కు ఐలవ్యూ చెప్పేదాన్ని అని.. కానీ ఇప్పుడు తాను ఫిగర్ అని అందుకే ఐలవ్యూ ఎక్కువగా చెప్పలేనని చెప్పింది.

అందరూ డబ్బు ఎందుకు తీసుకున్నావని అడుగుతున్నారని.. కానీ ఆ డబ్బు తన ఇంటి కోసం చాలా అవసరం అని అందుకే తీస్కున్నాని స్పష్టం చేసింది. అయితే ఈ విషయాలన్నీ యాంకర్ శివ ఇంటర్వ్యూలో తలిపిందీ బోల్డ్ అండ్ హాట్ యాంకర్ అరియానా గ్లోరీ.

https://www.instagram.com/reel/CegKYzFJIWP/?igshid=YmMyMTA2M2Y=

Read Also : Ariyana : గ్రాండ్ ఫినాలేలో అరియాన చేసిన పనికి ఆశ్చర్యపోతున్న నెటిజన్స్..!