Rainy Season : ప్రస్తుతం వర్షాకాలం మొదలవడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో వానలు దంచి కొడుతున్నాయి. పెద్ద ఎత్తున వర్షాలు కురవడంతో వాగులు వంగులు పొంగిపొర్లడమే కాకుండా ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇకపోతే అధిక వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ప్రమాదాలు కూడా చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లు భారీగా దెబ్బతింటాయి. అలాగే రోడ్లు మొత్తం వర్షపు నీటితో నిండిపోవడం వల్ల ఎక్కడ గుంతలు ఉన్నాయో తెలియక ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి.అయితే వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా సురక్షితంగా గమ్యం చేరుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మరి ఆ జాగ్రత్తలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
Rainy Season : వర్షంలో బండ్లపై వెళ్లేటప్పుడు తప్పక గుర్తించుకోవాల్సిన విషయాలివే..
వర్షాకాలం అంటేనే తొందరగా చీకటి పడుతుంది కనుక మనం ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలంటే ముందుగా మనం ప్రయాణించే వాహనం యొక్క లైట్స్ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.
అదేవిధంగా కొంతమంది వారి వాహనానికి వైపర్స్ లేకపోయినా అలాగే ప్రయాణం చేస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం.ఇలా వైపర్స్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల మనకు దారి కనిపించక ప్రమాదాలు జరిగే పరిస్థితి ఏర్పడుతుంది.వైపర్స్ సహాయంతో అద్దంపై పడే నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వల్ల రోడ్డు క్లియర్ గా కనబడుతుంది. తద్వారా ప్రమాదాలు కూడా తగ్గుతాయి.
వర్షాకాలంలో వర్షం పడుతుందని చాలామంది వేగంగా ప్రయాణిస్తుంటారు. అతివేగం ప్రమాదానికి ఎప్పుడు కారణమే. వర్షాకాలంలో రోడ్లు మొత్తం నీరు ఉండటం వల్ల ఎక్కడ మాన్ హోల్స్ తెరిచి ఉన్నాయో తెలియదు అలాగే రోడ్డు ఎక్కడ దెబ్బతిందో తెలియదు కనుక నిదానంగా ప్రయాణించడం ఎంతో ముఖ్యం.
ఇక తరచూ వర్షం పడటం వల్ల వాహనాలు వర్షానికి తడిచి కొన్ని సార్లు బ్రేక్స్ సరిగా పనిచేయవు అందుకోసమే ఒక వాహనానికి మరొక వాహనానికి కాస్త దూరం పాటించి ప్రయాణించడం ఎంతో మంచిది.వర్షాకాలంలో ఈ విధమైనటువంటి జాగ్రత్తలను పాటిస్తూ ప్రయాణం చేయడం వల్ల పూర్తిగా రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు.
Read Also : Viral Video: ఎంత సక్కగా అంటూ అందరిని ఓ ఊపు ఊపిన యువతి.. వీడియో వైరల్!
Tufan9 Telugu News And Updates Breaking News All over World