మూవీలో లిప్‌లాక్ సీన్స్‌ను సందర్భాన్ని బట్టి డైరెక్టర్లు తీస్తుంటారు. ఇందుకు కొంద మంది హీరోయిన్స్ ఓకే చెప్పినా మరికొందరు వాటిని యాక్సెప్ట్ చేయరు. లిప్ లాక్ సీన్ ఉంటే ఈ మూవీని వదులుకున్న హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. కేవలం ఓ వర్గం వారికి మాత్రమే నచ్చే ఈ సీన్స్ కోసం ఎవరితో బడితే వారికి లిప్ లాక్ ఇచ్చేందుకు హీరోయిన్స్ అంగీకరించరు. ఇక స్టార్ హీరోలతో చేసే సమయంలో కాదనలేక ఒప్పుకుంటారు. మూవీలో ఇలాంటి సీన్ ఉంటే మూవీ హిట్ సాధిస్తుందని కొంత మంది నమ్మకం.
ఇదిలా ఉండగా మలయాళంలోని ప్రేమమ్ మూవీతో చాలా పాపులర్ అయింది అనుపమ పరమేశ్వరన్. ఇక నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన అ ఆ మూవీలో యాక్ట్ చేసి అందరినీ మెప్పించింది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఎప్పడూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఓ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుతో మూవీ చేస్తూ అందులో అతనికి లిప్‌లాక్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ నడుస్తోంది. రెమ్యూరేషన్ ఇచ్చినంత మాత్రాన కొత్త వారికి లిప్ లాక్ ఇస్తారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. లిప్ లాక్ ఇచ్చేందుకు స్థాయి ఉండాలి కదా అంటూ మరికొందరు క్లాస్ పీకుతున్నారు. నెక్ట్స్ మూవీలో తమ హీరోకు కూడా లిప్ లాక్ ఇవ్వాలని మరి కొందరు స్వీట్ గా వార్నింగ్ ఇస్తున్నారు. ఎనర్జిటిక్ స్టార్ రాముతో కలిసి ఉన్నది ఒకటే జిందగి మూవీలో, శర్వానంద్ తో కలిసి శతమానం భవతి మూవీలో యాక్ట్ చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతో పాటు మళయాలం మూవీస్ లోనూ యాక్ట్ చేసింది అను.