Anchor Anasuya: యాంకర్ అనసూయ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఇద్దరు పిల్లలకు తల్లి అందంలో మాత్రం పదహారేళ్ల పడుచు పిల్లలకు తీసిపోదు. అలాంటి అందగత్తె తాజాగా చేసిన ఓ ట్వీట్ ఆమె తెగ ట్రోల్స్ కు గురయ్యేలా చేస్తోంది. ఈమెకు సపోర్ట్ గా నిలిచిన వాళ్లని కూడా నెటిజెన్లు వదలడం లేదు. ఇష్టం వచ్చినట్లుగా ట్రోల్స్ చేస్తూ.. తెగ ఇబ్బంది పెట్టేస్తున్నారు.
ఆంటీ అంటూ రకరకాల మీమ్స్ తో చెడుగుడు ఆడేస్తున్నారు. అయితే అనసూయ కూడా వీలైనంత వరకు వారికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. మరికొందరేమో హద్దులు దాటుతూ అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఓ వ్యక్తి ఏకంగా నీ రేటెంత అని అర్థం వచ్చేలా కామెంట్ చేశాడు. దానికి అనసూయ కూడా అంతే ఘాటుగా సమాధానం ఇచ్చింది.
మీ చెల్లో లేక భార్యో ఎంత తీసుకుంటారని అని అడిగితే ఏం చేస్తావంటూ బదులిచ్చింది. దీంతో భయపడిపోయిన నెటిజెన్ తన ట్వీట్ ను డిలీట్ చేశాడు. అనసూయ చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక అనసూయ కెరియర్ విషయానికి వస్తే… అనసూయ తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు ఒప్పుకుందని సమాచారం. గురజాడ అప్పారావు నటించిన క్లాసిక్ నాటకం.. కన్యాశుల్కం ఆధారంగా రాబోతున్న ఈ వెబ్ సిరీస్ లో అనసూయన వేశ్య పాత్రలో కనిపించబోతుంది.