Bandla ganesh : జీవితంలో ఎవరినీ నమ్మొద్దంటున్న బండ్లన్న.. ఆడియో టేప్ వైరల్!

Actor bandla ganesh audio viral
Actor bandla ganesh audio viral

Bandla ganesh : సోషల్ మీడియాలో ప్రతినిత్యం యాక్టివ్ గా ఉండే బండ్ల గణేష్.. తాజాగా ట్విట్టర్ లో ఓ ఆడియో టేప్ ను విడుదల చేశారు. జీవితంలో ఎవరినీ నమ్మొద్దంటూ బండ్ల చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఉన్నట్టుండి ఆయన ఈ ఉపోద్ఘాతం ఇస్తున్నాడని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. జీవితంలో ఎవరినీ నమ్మొద్దు. మనల్ని మనం నమ్ముకుందామని బండ్ల గణేష్ అన్నాడు. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను నమ్మకుందామని చెప్పాడు. భార్యను, మనం జన్మనిచ్చిన పిల్లలను ప్రేమిద్దాం అన్నాడు. మనల్ని కన్న తల్లిదండ్రులకు మంచి జీవితాన్ని ఇద్దమాని చెప్పాడు. మన తల్లిదండ్రులు మన మీద కోటి ఆశలతో ఉన్నారని అన్నాడు.

Bandla ganesh
Bandla ganesh

మన పిల్లలకు మంచి దారి చూపిద్దాం అన్నారు. వాళ్లు, వీళ్లు మోజులో పడి మన పిల్లలను, మన అమ్మానాన్నలను అన్యాయం చేయొద్దంటూ బండ్ల గణేష్ ఆడియోలో పేర్కొన్నాడు. బండ్లన్న పోస్టుకు నెటిజెన్ల నుంచి భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. ఏంటి బ్రో తాగావా.. అని అడుగుతున్నారు. ఏమైంది గణేష్ అ్న, ఏమైనా ఎదురు దెబ్బ తగిలిందా అని అడుగుతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సత్తా చాటిన బండ్ల గణేష్.. ప్రొడ్యూసర్ గా మారి పెద్ద హీరోలతో చిత్రాలను నిర్మించాడు. డేగల బాబ్జీ సినిమాలో ఇటీవలే హీరోగా నటించాడు. అయితే ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి ఆశించిన స్పందన రాలేదు.

Advertisement


Read Also :  Bandla Ganesh : ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తున్న బండ్ల.. అలా అనేశాడేంటి

Advertisement