Intinti Gruhalakshmi: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో లాస్య నందు ఇద్దరూ ప్లాన్ సక్సెస్ అవబోతుంది అని తెగ సంతోష పడుతూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో అభి, గాయత్రి ఇద్దరూ ఆస్తి గురించి మాట్లాడుతూ ఉండగా ఇంతలో అంకిత మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతుంది. ఇంతలోనే వారు మాట్లాడుకుంటూ ఉండగా అంకిత వాళ్ళ నాన్న ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాడు. అప్పుడు అంకిత ఆస్తి తన పేరు మీద ఉండటం చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ గాయత్రి మాత్రం అంకితం పేరు మీద ఎందుకు ఆస్తిని ట్రాన్స్ఫర్ చేశారు అని విరుచుకు పడుతుంది.
అయితే ఆస్తి తన పేరు మీద ఉంటుంది అని ఆశపడిన అభి కథ మొత్తం అడ్డం తిరగడంతో మనసులో బాధపడుతూ ఉంటాడు. కానీ పైకి మాత్రం నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. అప్పుడు గాయత్రి అశ్విని అంకిత పేరుమీద రాయమని నీకు ఎవరు సలహా ఇచ్చారు అని అడగ్గా అప్పుడు అంకిత తండ్రి తులసి సలహా ఇచ్చింది అని చెబుతాడు.
దీంతో గాయత్రి అభి ఇద్దరు కోపంతో రగిలి పోతూ ఉంటారు. అప్పుడు అంకిత తండ్రి తులసీ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటాడు. తులసి మాట్లాడుతూ లాస్య హాసిని కాల్ చేయడానికి ఎటువంటి ఎత్తుగడలు వేస్తుందో అంకిత తండ్రికి చెప్పడంతో అతను ఒక్కసారిగా షాక్ అవుతాడు. అభి గురించి ఆమె అంతగా ఆలోచిస్తూ ఉండటం చూసి ఆలోచించుకుంటూ అక్కడనుంచి వెళ్ళి పోతాడు. అలా జరిగింది మొత్తం గాయత్రి కి వివరించడంతో గాయత్రి మండిపడుతూ ఉంటుంది.
అప్పుడు వారు కొద్దిసేపు ఒకరిపై మరొకరు సీరియస్ అవుతూ తిట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు గాయత్రీ తులసి గురించి లేనిపోని అబద్ధాలు చెప్పి నెగెటివ్ గా చెప్పడంతో అప్పుడు అంకిత తండ్రి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తులసికి ఏముంది అని అడుగుతాడు. అంకిత కూడా తులసి గురించి గొప్పగా చెబుతుంది. అప్పుడు అంకిత తండ్రి అభిని ఫీల్ అవ్వద్దు అంటూ హత్తుకొని ధైర్యం చెబుతాడు.
మరొకవైపు ప్రేమ్ జాబ్ ట్రైల్ కోసం వెల్లగా అక్కడ అతను ఇదేమైనా పానీపూరి బండి అనుకున్నావా అంటూ నానా రకాల మాటలు అని అవమానిస్తాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో అభి కోపంతో లాస్య, నందుల దగ్గరికి వెళ్లి జరిగిందంతా వివరించడంతో నందు లాస్య ఇద్దరూ షాక్ అవుతారు. అప్పుడు అభి తులసి మీద కోపంతో ఇప్పటినుంచి మీ మీద యుద్ధం స్టార్ట్ అవుతుంది అని చెప్పి అక్కడి నుంచి తులసి ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి కొడుకు బాగు పడుతుంటే చూడలేని తల్లివి నువ్వు అంటూ నువ్వు నన్ను మోసం చేశావు. ఇంకెప్పుడు ఈ ఇంటి గడప తొక్కను అంటూ తులసి పై అరిచి అక్కడనుంచి వెళ్ళి పోతాడు. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.