MLA Wrote ssc exam: ఏడు పదుల వయసులో పదో తరగతి పరీక్ష రాసిన ఎమ్మెల్యే..!

చాలా మంది పిల్లలకు అన్ని వసతులు కల్పించి చదువుకోమంటేనే భారంగా చదువుతుంటారు. కానీ ఓడిషా ఒడిశాలోని కంధమాల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అంగాడ కన్హార్… ఏడు పదలు వయసులోనూ పదో తరగతి పరీక్షలు రాసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అయితే 1978లోనే ఆయన తన చదువును ఆపేసిన ఫుల్బాని ఎమ్మెల్యే.. ఆ తర్వాత రాజకీయాల్లో రాణించారు. అయితే తాను పదో తరగతి చదవలేకపోయాననే బాధతో ఎప్పుడూ కుమిలిపోయేవారు.

Advertisement

అయితే ఈ మధ్యే తాను పదో తరగతి పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే బోర్డు ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ (బీఎస్ఈ) నిర్వహిస్తున్న హైస్కూల్ వార్షిక పరీక్షలకు శుక్రవారం హాజరయ్యారు. ఆయన హాజరైన పరీక్షా కేంద్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్షలకు హాజరై వార్తల్లో నిలిచిన ఈ ఎమ్మెల్యేను… అందరూ అభినందిస్తున్నారు. ఆశయానికి వయసు ఎప్పుడూ అడ్డుకాదని సూచిస్తున్నారు. ఏడు పదుల వయసులోనూ పరీక్షలు రాయడం నిజంగా చెప్పుకోదగ్గ విషయమే. అందులోనూ ఏ ఎమ్మెల్యే రాయడం గమనార్హం.

Advertisement