Pixie curts : పిల్లలు అంటే ఏం చేస్తారు. ఆడుకుంటారు. వయసును బట్టి స్కూల్ కు వెళ్తారు. ఇంటికొచ్చి ఆడుకుంటారు. తినేసి, పడుకుంటారు. ఇంతకు మించీ పిల్లలకు ఏం పని ఉంటుంది. అంతే కదా.. ఎక్కడైనా, ఎవరి పిల్లలైనా చేసేది ఇదే. కానీ ఈ 11 ఏళ్ల చిన్నారి మాత్రం వ్యాపారవేత్తగా మారింది. అంతే కాదు నెలకు కోటి రూపాయలు సంపాదిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉందా.. అసలు విషయం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆస్ట్రేలియాకు చెందిన పిక్సీ కర్టిస్ ఆ చిన్నారి పేరు. ఆమె తల్లి పేరు రాక్సీ జాసెంకో. రాక్సీకి ఒక కోరిక ఉండేది. ఏంటంటే.. తన కూతుర్ని వ్యాపారవేత్తగా చూడాలని అనుకుంది. చిన్నప్పుడే ఆ దిశగా అడుగులు వేయించింది. కూతురు పుట్టగానే ఆమె పేరు మీద 2011 లో పిక్సీస్ బౌస్ అనే వ్యాపారం ప్రారంభించింది. ఇది జుట్టుకు సంబంధించిన వస్తువులు అందించే వ్యాపారం. దాని తర్వాత పిల్లలు ఆడుకునే బొమ్మల వ్యాపారం మొదలు పెట్టించింది రాక్సీ. రాక్సీ తన కూతురి పేరు మీద ప్రారంభించిన ఆ వ్యాపారాలు ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా లాభదాయకంగా నడుస్తున్నాయి. 2030 నాటికి వీటి ద్వారా నెలకు రూ. 15 కోట్ల ఆదాయం వస్తుందని రాక్సీ అంటోంది. అలా తల్లి ప్రోత్సాహం, ప్రోద్బలంతో పిక్సీ వ్యాపారవేత్తగా దూసుకుపోతోంది. ఇంత చిన్నప్పుడే కోట్లాది రూపాయలు ఆర్జిస్తోంది.
Read Also : Bussiness ideas : రైతులను లక్షాధికారులను చేస్తున్న పంట.. ఏమిటో తెలుసా?