Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Guppedantha Manasu july 12 Today Episode : రిషి,సాక్షి లపై కోపంతో రగిలిపోతున్న వసు.. బాధపడుతున్న జగతి..?

Guppedantha Manasu july 12 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపి

By Ramesh Babu

Published on: July 12, 2022 8:28 AM

Updated on: July 12, 2022 10:06 AM

---Advertisement---

Guppedantha Manasu july 12 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వసు,రిషి ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో రిషి మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ విషయంలో ఒక మీటింగ్ ను ఏర్పాటు చేసి సొంతంగా కొన్ని అంశాలను తెలుపుతాడు. ఆ తర్వాత జగతిని మీరు జగతి ప్రిపేర్ చేయించిన ఫైల్ అడగగా ఫైల్ కనిపించడం లేదు అనే వసు,జగతికి చెప్పడంతో సరే ఫైల్ తరువాత కీ ఇవ్వండి అని అంటాడు. ఇంతలోనే సాక్షి అక్కడికి రావడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.

Advertisement

vasudhara fires on rishi and sakshi in todays guppedantha manasu serial episode

అప్పుడు రిషి కూడా సాక్షికి పర్మిషన్ ఇవ్వడంతో వసు ఆశ్చర్య పోతుంది. అప్పుడు సాక్షి ఈ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుకి తాను ఒక వాలంటరీగా ఉంటాను అని అనడంతో రిషి ఓకే అని అంటాడు. అప్పుడు జగతి ప్లాన్ ని కాపీ కొట్టిన సాక్షి రిషికి ఆ ప్రాజెక్టు గురించి చెప్పడంతో జగతి, వసు షాక్ అవుతారు. అప్పుడు జగతి సాక్షి ప్లాన్ విన్న జగతి అది తన ప్లాన్ అని అనుకుంటుంది.

Guppedantha Manasu : సాక్షి రిషికి ఆ ప్రాజెక్టు గురించి చెప్పడంతో జగతి, వసు షాక్ అవుతారు…

అసలు విషయం తెలియక రిషి సాక్షి ఆలోచన బాగుంది అని తనని పొగుడుతూ ఉండగా అప్పుడు వసు కావాలనే తన మీద కోపంతో రిషీ సార్ సాక్షికి దగ్గర అవుతున్నాడు అని అనుకుంటుంది. కానీ రిషి మాత్రం తన పెద్దమ్మ అన్న మాటలను గుర్తు తెచ్చుకొని సాక్షికి దగ్గర అవుతూ ఉంటాడు. ఆ తర్వాత జగతి మీటింగ్ లో జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉండగా, అప్పుడు వసు వచ్చి మీటింగ్ లో పోయింది అనుకున్న ఫైల్ దొరికింది అనడంతో ఎలా దొరికింది అని ఆలోచిస్తూ ఉంటారు.

Advertisement

ఆ తర్వాత వసు ప్రవర్తన సరిగా లేకపోవడంతో నీకు ఏమయ్యింది అని అడుగుతుంది జగతి. అలా వారిద్దరు కొద్దిసేపు మాట్లాడుతూ ఉంటారు. జగతి, వసుధారల మాటలు విన్న సాక్షి ఆ ఫైల్ నేనే తీసుకొని కాపీ చేశాను. ఇకపై వసు ఆలోచనలన్నీ కూడా కాపీ చేస్తాను అని మనసులో అనుకుంటుంది.

మరొకవైపు సాక్షి రిషి కారులో వెళ్లడం కోసం కాలేజ్ బయట ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో వసు ఇంకా వెళ్లలేదు అని తెలిసీ వసుధార కోసం క్యాబ్ బుక్ చేస్తుంది. ఆ తర్వాత వారు ముగ్గురు కలిసి కారులో వెళ్తారు. అప్పుడు సాక్షి, రిషి పక్కనే కూర్చోగా వెనకాల వైపు కూర్చున్న వసుధార వెంటనే సాక్షి సీటు బెల్టు పెట్టుకో అని చెబుతుంది. నా భయం నాది అని తన మనసులో అనుకుంటుంది.

ఆ తర్వాత కారులో వెళ్తూ ఉండగా రిషి, అద్దంలో వసుని గమనిస్తూ ఉంటాడు. వసు మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక రిషి, అద్దంలో వసు చూస్తున్నాడు అని గమనించిన సాక్షి,రిషి ని మాటల్లో ముంచే ప్రయత్నం చేస్తూ ఎంగేజ్మెంట్ టాపిక్ గురించి మాట్లాడుతూ అన్ని బాగుంటే ఈపాటికి పెళ్లి అయ్యేది అని అనటంతో వెంటనే వసుధార కోపంతో ఆపుతారా అని గట్టిగా అంటుంది.

Read Also : Guppedantha Manasu july 11 Today Episode : మళ్ళీ దగ్గరవుతున్న వసు,రిషి.. మరొక ప్లాన్ వేసిన దేవయాని..?

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :