Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Karthika Deepam july 12 Today Episode : సౌందర్య ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్న శౌర్య.. అసలు విషయం తెలుసుకున్న స్వప్న..?

Karthika Deepam july 12 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ ల

By Ramesh Babu

Published on: July 12, 2022 7:28 AM

Updated on: July 12, 2022 8:27 AM

---Advertisement---

Karthika Deepam july 12 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్వాలకి జ్వరం రావడంతో హిమ జ్వాలా ని తన ఇంటికి తీసుకొని వెళుతుంది.

ఈరోజు ఎపిసోడ్ లో సౌర్యకు మెలుకువ వచ్చి చూసేసరికి నేను ఎక్కడ ఉన్నాను నాకు ఏమయింది అంటూ చుట్టూ రూమ్ లో చూడగా అక్కడ హిమ, సౌర్య ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతలోనే అక్కడికి సౌందర్య, ఆనంద్ రావ్, హిమ వస్తారు. అప్పుడు శౌర్య, హిమని చూసి నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడగగా అప్పుడు వెంటనే సౌందర్య,శౌర్య నువ్వే మా ఇంటికి వచ్చావు అనడంతో శౌర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది.

Advertisement

Hima and her family feel elated as Sourya agrees to stay with them in todays karthika deepam serial episode

అప్పుడు శౌర్య, హిమ తనకు హెల్త్ చెక్ చేసిన దానికి డబ్బులు ఇస్తాను అని అనడంతో  పై సీరియస్ అవుతుంది. అప్పుడు శౌర్య, హిమను మరింత అపార్ధం చేసుకుంటుంది. అప్పుడు సౌందర్య నచ్చచెప్పే ప్రయత్నం చేసిన కూడా శౌర్య వినిపించుకోదు. హిమ మీరు ఇద్దరు నన్ను మోసం చేసారు అని అంటుంది.

Karthika Deepam : హిమ గురించి అసలు విషయం తెలుసుకున్న స్వప్న…

అప్పుడు ఆనందరావు అసలు విషయం చెప్పడానికి ప్రయత్నించినా కూడా శౌర్య వినిపించుకోకుండా నాకు ఎవరూ లేరు అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడు సౌందర్య ఎమోషనల్ అవుతూ కార్తీక్ దీపా నీకు అమ్మానాన్నలు అయితే నాకు కొడుకు కోడలు మరి నేను ఎంత బాధ పడాలి ఎప్పుడైనా నా గురించి ఒక్కసారైనా ఆలోచించావా అని ఎమోషనల్ అవుతుంది.

Advertisement

అప్పుడు వాళ్ళందరూ మాట్లాడుతున్న సౌర్య అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుండడంతో అప్పుడు ఆనందరావు నేను రెండు నిమిషాలు మాట్లాడతాను విను అని శౌర్య చేతులు పట్టుకొని అడుగుతాడు. అప్పుడు శౌర్యని కార్తీక్ ,దీప ల ఫోటోలు దగ్గరికి తీసుకుని వెళ్లి ఎమోషనల్ గా మాట్లాడుతాడు. అప్పుడు అందరు ఆనందరావు మాటలకు ఎమోషనల్ అవుతారు.

అప్పుడు ఆనందరావు నేను చనిపోయిన తర్వాత అయినా నా మనవరాలు నన్ను చూసేకు వచ్చేలా చెయ్యి దేవుడా అనుకుంటాను అని అనడంతో అందరూ మరింత బాధపడతారు. అప్పుడు శౌర్య మాట్లాడుతూ ఉండు అనగానే ఉండాలా నేను వెళ్లి నా ఆటో తెచ్చుకుంటాను అనడంతో అందరూ ఒక్కసారిగా సంతోషపడతారు.

అప్పుడు శౌర్య మాటలకు సౌందర్య కుటుంబం మొత్తం సంతోష పడుతూ ఉంటారు. మరొకవైపు ఇంద్రమ్మ జ్వాలా ఇంట్లో లేదు అని బాధ పడుతూ ఉంటారు. అప్పుడు జ్వాలా ని ఒక్కసారి అయిన చూడాలి అని ఎమోషనల్ అవుతుంది ఇంద్రమ్మ. అప్పుడు ఇంద్రమ్మకు ఇంద్రుడు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు. మరొకవైపు శోభ,హిమ క్యాన్సర్ పేపర్లు తీసుకొని స్వప్న దగ్గరికి వెళ్తుంది.

అప్పుడు శోభ,హిమ గురించి నీకు నిజం తెలియాలి అని చెప్పి హిమ క్యాన్సర్ పేపర్లు స్వప్నకి ఇవ్వడంతో స్వప్న అసలు విషయం తెలుసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు హిమ దేవుడికి శౌర్య గురించి అడుగుతూ ఉంటుంది.

ఎలా అయినా సౌర్య మనసులో నా మీద ఉన్న కోపాన్ని తగ్గిస్తాను అని అంటుంది. ఆ తర్వాత కార్తీక్,దీప ఫోటోల దగ్గరికి వెళ్లి శౌర్య మన ఇంటికి వచ్చింది అని ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడు హిమ అసలు విషయాన్ని చెప్పేస్తాను అని సౌందర్యతో అంటుంది. అప్పుడు హిమ,సౌందర్య లు శౌర్య గురించి తలచుకొని ఆనంద పడుతూ ఉంటారు.

Read Also : Karthika Deepam July 11 Today Episode : సూపర్ ట్విస్ట్.. శోభకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జ్వాలా.. సౌందర్య ఇంట్లో సౌర్య..?

, , , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.