Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Telugu TV Serials Rating: దారుణంగా పడిపోయిన తెలుగు టీవీ సీరియల్స్ రేటింగ్.. మొదటి స్థానాన్ని ఆక్రమించిన ఆ సీరియల్?

Telugu TV Serials Rating: తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే ఒక్కో సీరియల్ మరొక సీరియల్ కిగట్టి పోటీ ఇస్తూ ప్రసా

By Ramesh Babu

Published on: June 10, 2022 3:54 PM

Updated on: June 10, 2022 3:56 PM

---Advertisement---

Telugu TV Serials Rating: తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే ఒక్కో సీరియల్ మరొక సీరియల్ కిగట్టి పోటీ ఇస్తూ ప్రసారమయ్యేవి. అయితే గత కొంత కాలం నుంచి ఈటీవీ సీరియల్స్ రేటింగ్ అమాంతం పడిపోయాయని తెలుస్తోంది. ఏకంగా సగానికి సగం రేటింగ్స్ పడిపోయాయి.డాక్టర్ బాబు వంటలక్క ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం కార్తీకదీపం సీరియల్ ఒకనొక సమయంలో ఏకంగా 21.07 శాతం రేటింగ్ సంపాదించుకుంది. ఇండియాలోనే నెంబర్ వన్ టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకున్న సీరియల్ గా కార్తీకదీపం నిలబడింది.

pjimage 2022 06 10T155327.725ఇకపోతే ఈ సీరియల్ ప్రస్తుతం సగానికి సగం రేటింగ్ పడిపోయిందని చెప్పాలి. ఇందుకు కారణం ఇందులో ప్రధానంగా నిలిచినటువంటి డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత పాత్రలను తొలగించడమే. ఇకపోతే తాజాగా బార్క్ రేటింగ్ మే 28 నుంచి జూన్ 3 వరకు ఈ సీరియల్ కేవలం 9.86 రేటింగ్ మాత్రమే సొంతం చేసుకుంది.9.73 రేటింగ్ తో కార్తీకదీపం తరువాత దేవత సీరియల్ రెండవ స్థానంలో నిలబడింది. ఇకపోతే కార్తీకదీపం సీరియల్ కు గట్టి పోటీగా ఉన్నటువంటి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ మూడవ స్థానానికి వెళ్ళింది.

Advertisement

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఏకంగా 9.39 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది. ఇకపోతే ఫ్యామిలీ ఎమోషన్ తో ఎంతగానో ఆకట్టుకున్న గుప్పెడంత మనసు సీరియల్;9.08 పాయింట్లతో నాలుగవ స్థానంలో ఉంది. జానకి కలగనలేదు 6.61 పాయింట్లతో ఐదవ స్థానంలో నిలబడింది. ఇకపోతే 6.53 పాయింట్లతో తర్వాత స్థానంలో ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్ రేటింగ్ సొంతం చేసుకుంది.ఈ విధంగా టీవీ సీరియల్స్ రేటింగ్ అమాంతం తగ్గి పోయినప్పటికీ కార్తీకదీపం సీరియల్ ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగడం విశేషం.

, ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.