Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Karthika Deepam: సౌర్య చేతులు పట్టుకుని థాంక్స్ చెప్పిన నిరుపమ్.. ఒంటరిగా వదిలేయండి అంటూ చేతులెత్తి మొక్కిన సౌర్య..?

Karthika Deepam: తెలుగు బులితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్

By Ramesh Babu

Published on: August 10, 2022 8:52 AM

Updated on: August 10, 2022 8:52 AM

---Advertisement---

Karthika Deepam: తెలుగు బులితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరుపమ్, పెళ్ళికొడుకు గెటప్ లో చూసి స్వప్న మురిసిపోతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో స్వప్న,నిరుపమ్ నీ పెళ్ళికొడుకు గెటప్ లో చూసి తెగ మురిసిపోతూ ఆనందంతో పొగుడుతూ ఉంటుంది. ఆ తర్వాత స్వప్న,నిరుపమ్ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి రమ్మని చెప్పి పిలుస్తుంది. అప్పుడు సత్య అదంతా చూస్తూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. మరొకవైపు సౌందర్య ఇంట్లో పెళ్లి పనులు హడావిడిగా జరుగుతూ ఉండగా హిమ ఒకచోట కూర్చుని ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

Advertisement

Swapna lashes out at Shoba as she finds out her evil plan in todays karthika deepam serial episode

అది గమనించిన సౌందర్య ఏం జరిగింది హిమ ఎందుకు అలా ఏడుస్తున్నావు అని అడగగా అప్పుడు హిమ, శోభ,నిరుపమ్ పెళ్లి గెటప్ లో కలిసి ఉన్న ఫోటోని సౌందర్య వాళ్లకు చూపించడంతో వాళ్ళు ఒకసారిగా షాక్ అవుతారు. ఆ ఫోటోని చూసి సౌందర్య దంపతులు హిమ బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి వచ్చి ఏంటి కొత్త డ్రామా మొదలుపెట్టారు అని అంటుంది.

అప్పుడు సౌందర్య అసలు విషయం చెప్పి ఆ ఫోటో చూపించడంతో సౌర్య కూడా ఆశ్చర్య పోతుంది. ఆ తర్వాత నానమ్మ మహానటిని ఏడుపు ఆపమని చెప్పు అని అంటుంది. అప్పుడు సౌర్య మీరు ఏం భయపడవద్దు. ఆ పెళ్లినీ నేను చెడగొడతాను అని అంటుంది. అప్పుడు సౌందర్య ఎలా చెడగొడతావు అని అడగగా మీరేం మాట్లాడకుండా నాతో రండి అని వారి ముగ్గురిని పిలుచుకొని స్వప్న ఇంటికి వెళుతుంది.

మరొకవైపు శోభ పెళ్లి కూతురు గెటప్ లో తననీ తాను చూసుకొని మురిసిపోతూ ఉంటుంది. ఈరోజుటితో నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నీ అప్పులు మొత్తం తీరిపోతాయి శోభ అంటూ తనని తానే పొగుడుతూ ఆనందపడుతూ ఉండగా ఇంతలోనే సౌందర్య వాళ్ళు శోభ అరేంజ్ చేసిన రౌడీని పిలుచుకొని వస్తారు. అప్పుడు సౌర్య స్వప్న వాళ్ళందరినీ పిలిచి ఆ రౌడీ తో అసలు విషయాన్ని బయట పెట్టిస్తుంది.

Advertisement

అయినా కూడా శోభా సారీ చెప్పిన విషయాన్ని ఒప్పుకోకపోగా వీళ్ళ అబద్ధం చెబుతున్నారు అని అనడంతో వెంటనే సౌర్య బ్యాంక్ ఆఫీసర్లను రమ్మని చెబుతుంది. బ్యాంక్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత శోభా నిజస్వరూపం బయట పడుతుంది. అప్పుడు కూడా శోభ, స్వప్న నీ నమ్మించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు స్వప్న శోభ చెంప చెల్లుమనిపిస్తుంది.

అప్పుడు శోభ ఈ ఇంటికి కాబోయే కోడల్ని కొడుతున్నారా ఆంటీ? అని అనగా స్వప్న మళ్లీ కొట్టి మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అరుస్తుంది. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న స్వప్న సౌర్యకి ధన్యవాదాలు తెలుపుతుంది. ఆ తర్వాత స్వప్న ప్రేమగా సత్య కోసం పాలు తీసుకుని వస్తుంది. అది చూసిన సత్య ఆశ్చర్యపోతాడు. ఇన్నేళ్ల పాటు మన మధ్య దూరం పెరిగింది అని బాధపడుతుంది స్వప్న. అలా వారిద్దరూ గతంలో జరిగిన విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.

ఇక రేపటి ఎపిసోడ్ లో నిరుపమ్, సౌర్య దగ్గరికి వెళ్లి సౌర్య చేతులు పట్టుకొని చాలా థ్యాంక్స్ సౌర్య అని చెప్పడంతో, వెంటనే సౌర్య చిరాకుగా మీకు చెప్పడానికి ఎలా ఉందో కానీ నాకు వినడానికి చాలా చిరాకుగా ఉంది ఇప్పటికైనా నన్ను వదిలేయండి అంటూ నిరుపమ్ కి చేతులెత్తి మొక్కి ప్రాధేయపడుతుంది.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.