Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Karthika Deepam: హిమను చూసి మురిసిపోతున్న ప్రేమ్.. హిమ, నిరుపమ్ లకు షాక్ ఇచ్చిన సౌర్య..?

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్

By Ramesh Babu

Published on: July 23, 2022 8:55 AM

Updated on: July 23, 2022 8:55 AM

---Advertisement---

Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌందర్య ఆనందరావు, హిమ, సౌర్య లను కలపడానికి కొత్త కొత్త ప్లాన్లు వేస్తూ ఉంటారు.

ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా హిమ హాస్పిటల్ కి వెళుతూ ఉండగా అప్పుడు ఆనందరావు తనకు బాగాలేదు అని నటిస్తాడు. అప్పుడు హిమ బాగానే ఉన్నావు కదా తాతయ్య అని అనగా వెంటనే సౌర్య కొంతమంది డాక్టర్లు బిజీ బిజీగా ఉంటారు మన హాస్పిటల్ కి వెళ్దాం పద అని అంటుంది. అలా సౌందర్య వాళ్ళు అనుకున్న విధంగా మొత్తానికి హిమను హాస్పిటల్కి వెళ్ళకుండా ఆపేస్తారు.

Advertisement

Shoba questions Swapna about her marriage with Nirupam in todays karthika deepam serial episode

ఆ తర్వాత హిమ ఒంటరిగా కూర్చొని సౌర్య గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే ప్రేమ్ అక్కడికి వస్తాడు. అప్పుడు హిమ,నిరుపమ్ బావని సౌర్యని ఎలా అయినా ఒకటి చేయాలి అని ప్రేమ్ కి చెప్పడంతో ఆ మాట విన్న ప్రేమ్ సంతోష పడుతూ ఉంటాడు. మరొకవైపు శోభ,నిరుపమ్ కాఫీ షాప్ లో కూర్చుని మాట్లాడుతూ ఉండగా అప్పుడు నిరుపమ్ అసలు హిమ కు క్యాన్సర్ లేదు అనటంతో శోభ షాక్ అవుతుంది.

ఇంతలోనే ప్రేమ ఫోన్ చేసి ఆనందరావుకి బాగాలేదు తొందరగా రమ్మని చెప్పడంతో ప్రేమ్ అక్కడి నుంచి బయలుదేరుతాడు. మరొకవైపు సౌందర్య ఆనందరావులు వారు చేస్తున్న ప్లాన్లు అన్ని ఫెయిల్ అయినందుకు బాధపడుతూ ఉంటారు. ఎలా అయినా హిమ,సౌర్యలను ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మరొకవైపు శోభ, స్వప్న ఇద్దరు నిరుపమ్ పెళ్లి విషయం గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు.

అప్పుడు శోభ ఆంటీ మీరు నాకు మాట ఇచ్చారు ఎలా అయినా నిరుపమ్ కీ నాకు పెళ్లి చేయాలి లేదంటే నేను ఎంత దూరమైనా వెళ్తాను అని స్వప్నకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. మరొకవైపు నిరుపమ్, సౌందర్య ఇంటికి వచ్చి ఆనంద్ రావు కి హెల్త్ బాగాలేదు అనడంతో హిమని చూసుకోవాలి కదా అని తిడతాడు.

Advertisement

ఇంతలోనే సౌర్య కోసం ఒక అతను ఆటో టైర్ నుతీసుకొని వస్తాడు. అప్పుడు ప్లాన్ ఫెయిల్ అయినందుకు సౌందర్య, ఆనంద్ రావ్ లు బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఆనందరావు హెల్త్ చెక్ చేయడానికి రూమ్ లోకి పీలుచుకొని వెళ్లగా,ప్రేమ్ సౌర్య ఆటో దగ్గర నిలబడి ఎలా కలపాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.

ఇంతలోనే సౌందర్య అక్కడికి రావడంతో వారిద్దరి కలిసి సౌర్య,హిమ లను ఎలా కలపాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సౌర్య ఆటో రెడీ అవ్వడంతో ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా వెళ్తాను అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో నిరుపమ్, సౌర్య దగ్గరికి వెళ్లి ఎలా అయినా నన్ను హిమను కలుపు అని అనడంతో వెంటనే అక్కడికి వచ్చిన హిమ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని అంటుంది.

అదంతా వారిద్దరి ప్లాన్ అని అపార్థం చేసుకున్న జ్వాలా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సౌర్య తాళిబొట్టును తీసుకొని వచ్చి మెడలో కట్టు అంటూ నిరుపమ్, హిమకు షాక్ ఇస్తుంది.

, , , , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.