Karthika Deepam : దీపను ఎంక్వయిరీ చేస్తున్న సౌందర్య, ఆనందరావు.. అనుమానంలో డాక్టర్ బాబు!

Updated on: January 22, 2022

Karthika Deepam : బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్ పనిచేస్తున్న హోటల్ కి సౌందర్య, ఆనందరావ్ టీ తాగడానికి వస్తారు. వాళ్ల కోసం టీ తీసుకుని వస్తున్న కార్తీక్ వాళ్లను చూసి షాక్ అవుతాడు. ఇక అప్పారావు ఆ టీ ను తీసుకొని వెళతాడు. సౌందర్య, ఆనంద్ రావ్ లు టీ తాగుతూ ఉండగా అక్కడే ఉన్న అప్పారావు వాళ్లతో చిట్ చాట్ చేయటం మొదలు పెట్టాడు.

ఆ క్రమంలో వాళ్లకు మోనిత తో కలిసి దిగిన సెల్ఫీను చూపిస్తాడు. అది చూసిన కార్తీక్ కు గుండె పగిలినంత పని అవుతుంది. ఇక మోనిత సెల్ఫీ ను చూసిన సౌందర్య కంగారుగా ఆనందరావ్ ను అక్కడినుంచి తీసుకొని వెళ్తుతుంది. తర్వాత కార్తీక్ నా తల్లిదండ్రులు నా గురించి ఇంతలా బాధ పడుతున్నారా అని మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు. తర్వాత కార్తీక్ కు మనసు బాగాలేక.. హోటల్ కు సెలవు పెట్టి ఇంటికి వెళతాడు.

మరోవైపు సౌందర్య, ఆనంద్ రావ్ లు కారులో ఆనందంగా వెళుతూ ఉంటారు. అలా వెళుతూ వాళ్ళు తాగిన కాఫీ గురించి ఆలోచిస్తారు. అది అచ్చం మన దీప కలిపిన కాఫీ లానే ఉంది అని అనుకుంటారు. ఒకవేళ ఆ కాఫీ కలిపింది దీప ఏమో అని ఒకసారి వెళ్లి చూడాలని అనుకుంటారు. మరోవైపు రుద్రాణి బాబును తీసుకు వచ్చిన సంగతి తెలిసిన దీప కోపంగా రుద్రాణి ఇంటికి వెళ్తుంది. అక్కడ రుద్రాణి ‘అప్పు కాకపోయినా వడ్డీ అయినా కట్టి బాబుని తీసుకొని వెళ్ళు’ అది కాదని ఎక్కువ చేస్తే.. మీ ఇద్దరి పిల్లలను కూడా తీసుకు వస్తానని బెదిరిస్తోంది.

Advertisement

Karthika Deepam : దీపపై ఎంక్వయిరీ..  అనుమానంలో డాక్టర్ బాబు!

అలా తన మాటలతో రుద్రాణి దీపను బెదిరించడంతో దీప బాధపడుతూ అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆ తర్వాత కాఫీ కలిపింది ఎవరో తెలుసుకోవడానికి సౌందర్య ఆనందరావ్ లు హోటల్ దగ్గరికి వచ్చి ఇన్ఫర్మేషన్ అడిగితే.. ఆ హోటల్ ఓనర్ ఆ టీ కలిపింది సాంబయ్య అని అబద్ధం చెప్పి పంపిస్తాడు. మరోవైపు కార్తీక్ కు రుద్రాణి బాబుని ఎత్తుకెళ్లిన నిజం తెలుస్తుంది. ఇది తెలిసిన కార్తీక్ రుద్రాణి ఇంటికి వెళ్తాడు. రుద్రాణి కార్తీక్ ను కూడా బెదిరించి పంపిస్తుంది. తన హోటల్ యజమాని అప్పు అడగటంతో వంట మనిషికి ఇచ్చానని అంటాడు. కార్తీక్ కు ఆ వంట మనిషి దీపనా అని అనుమానం వస్తుంది.

Read also : Karthika Deepam: కార్తీక దీపం లో హైలెట్ సీన్.. ఏకంగా డాక్టర్ బాబు పనిచేసే హోటల్ కు వెళ్లిన సౌందర్య, ఆనందరావు!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel