Karthika Deepam Feb 2 Episode Today : బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. కార్తీక్, దీప.. సౌర్య గురించి బాగా బాధపడుతూ ఉంటారు. హాస్పిటల్లో ఎవరు ముందుకు రాకపోవటంతో కార్తీక్ తానే స్వయంగా తన కూతురికి చిన్న ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇక తన క్యాబిన్ లో కూర్చున్న డాక్టర్ అక్కడ సీసీ ఫుటేజీ ఆధారంగా కార్తీక్ వాళ్ళను చూసి వాళ్ళు ఏం చేస్తున్నారో అని ఆశ్చర్యపోతూ ఉంటుంది.

కార్తీక్ ఎవరికీ కనిపించకుండా దీప వాళ్లను అడ్డుగా ఉండమంటాడు. దాంతో అక్కడ ఉన్న నర్సు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారని.. మీరు ఎలా ట్రీట్మెంట్ చేసుకుంటారని గట్టిగా ప్రశ్నిస్తుంది. వెంటనే తనకు మరో పేషెంట్ సీరియస్ గా ఉందని తెలియడంతో అక్కడి నుంచి వెళ్తుంది. కార్తీక్ ఎలాగైనా తన కూతుర్ని రక్షించుకోవాలని తాపత్రయ పడుతుంటాడు.
అంతలోనే డాక్టర్ వచ్చి ఇక్కడ మీరు ఏం చేస్తున్నారని కార్తీక్ వాళ్ళను అడిగి అక్కడ ఉన్న స్టాఫ్ పై అరుస్తుంది. మరోవైపు మోనిత.. ఆదిత్య, శ్రావ్య వాళ్లకు ఎదురుపడుతుంది. ఇక తన మాటలతో వాళ్లను బాగా రెచ్చగొడుతుంది. ఆదిత్య కూడా తనపై గట్టిగా అరుస్తాడు. అయినా కూడా మోనిత తను ఆ ఇంటికి దేవుడిచ్చిన కోడల్ని అంటూ గట్టిగా మాట్లాడుతుంది. మరో పదిరోజుల్లో కార్తీక్, బాబులతో మీ ముందు ఉంటానని మాట ఇస్తుంది.













