Devatha july 11 Today Episode : మాధవకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన రాధ.. దేవికి గోరుముద్దలు తినిపించిన ఆదిత్య..?

Updated on: July 11, 2022

Devatha july 11 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సత్య రుక్మిణి ఫోటోను నేనే తీశాను ఆదిత్య అనడంతో ఆదిత్య షాక్ అవుతాడు.

ఈరోజు ఎపిసోడ్ లో ఆదిత్య, రుక్మిణి కి ఫోన్ చేసి దేవి గురించి గొప్పగా పొగుడుతూ ఉండటంతో రాధ సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. దేవీలో నీలాగే మంచి పట్టుదల ఉందని తను చెస్ కూడా బాగా ఆడుతుంది. తనలో మంచి టాలెంట్ ఉంది అని పొగడడంతో రాధా సంతోష పడుతూ ఉంటుంది. రాధా మాట్లాడిన మాటలు విన్న మాధవ కోపంతో రగిలిపోతూ ఉంటాడు.

Devatha july 11 Today Episode
Devatha july 11 Today Episode

ఆదిత్య, రాధా ఇద్దరు ఫోన్లో మాట్లాడితే ఏం చేస్తున్నారు అనేది తెలుస్తుంది కానీ ఈ మధ్య వాళ్ళు నేరుగా కలుస్తున్నారు ఎందుకు కలుస్తున్నారు అంటూ వాళ్ళ మీద అనుమాన పడుతూ ఉంటాడు. ఇంతలోనే రామ్మూర్తి పిల్చడంతో మాధవ అక్కడికి వెళ్తాడు. అప్పుడు ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు అని రామ్మూర్తి దంపతులు ప్రశ్నించగా పిల్లల స్కూల్ విషయం గురించి ఆలోచిస్తున్నాను అని అంటాడు.

Advertisement

ఇదే విషయం గురించి రాధ తో కూడా చర్చించాలి అని అనడంతో అప్పుడు రామ్మూర్తి దంపతులు ఎందుకు అని అడగగా అప్పుడు మాధవ పిల్లలు ఇద్దరు ఇప్పటివరకు కలిసే ఉన్నారు ఇప్పుడు స్కూల్స్ విషయంలో దూరమవుతారు కదా అందుకే అని చెప్పడంతో వాళ్లు ముగ్గురు ఆలోచనలో పడతారు.

Devatha : ఆదిత్యకు దగ్గరవుతున్న దేవిని మాధవ్ దూరం చేయగలడా..

మరొకవైపు ఆదిత్య, దేవి ఇద్దరు సీరియస్ గా చెస్ గేమ్ ని ఆడుతూ ఉండగా ఇంతలో అక్కడికి దేవుడమ్మ వస్తుంది. భోజనం చేయమని చెప్పడంతో అప్పుడు దేవి మళ్లీ చేస్తాను అని చెప్పడంతో దేవుడమ్మ రుక్మినేని గుర్తు చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కూడా దేవి చెస్ లో ఓడిపోవడంతో ఆదిత్య ధైర్యం చెబుతూ ఉంటాడు.

ఆ తరువాత దేవుడమ్మ, ఆమె భర్తతో మాట్లాడుతూ దేవిని చూస్తే రుక్మిణి గుర్తుకు వస్తుంది. చూసుకుంటున్నాను అని అంటుంది. మరొకవైపు మాధవ రాధ గురించి ఆలోచిస్తూ రాధ ఏమి తెలియనట్టుగానే ఉంటూ ఆదిత్యకు దేవిని దగ్గర చేస్తోంది అని కోపంగా ఉంటాడు.

Advertisement

ఆ తర్వాత ఎలా అయినా దేవిని ఇంటికి రప్పించాలి అని స్కూల్ ప్రిన్సిపాల్ కి ఫోన్ చేసి దేవిని ఇంటికి పంపించేలా చేయమని అనడంతో అప్పుడు ప్రిన్సిపల్ ఆదిత్య సార్ దేవిని జూనియర్ చెస్ కాంపిటీషన్ కు అర్థం చేస్తున్నారు అని అనడంతో మాధవ షాక్ అవుతాడు. మాధవ మాటలు విన్న రాదా నీకు ఒకసారి చెబితే అర్థం కాదా దేవి వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్తే నీకేంటి ఇబ్బంది అంటూ మాధవకు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.

మరొకవైపు దేవి, ఆదిత్య చెస్ ఆడటానికి సిద్ధంగా ఉంటారు. అప్పుడు చెస్ కాంపిటీషన్ వాళ్లకు ఆదిత్య ఫోన్ చేసి దేవి డీటెయిల్స్ ఇస్తాడు. ఆ విషయాన్ని సత్యకు చెప్పడంతో సత్య కూడా సంతోషపడుతుంది. ఆ తర్వాత ఆదిత్య, దేవి ఇద్దరు మళ్లీ కూర్చొని అతను ప్రారంభించగా ఆ ఆటలో దేవి గెలుస్తుంది. ఇంతలో దేవుడమ్మ అక్కడికి వచ్చి భోజనం తినమని అడగగా మళ్లీ తింటాను అని చెప్పడంతో దేవికి నేను తినిపిస్తాను అని చెప్పి గోరుముద్దలు తినిపిస్తాడు ఆదిత్య. అప్పుడు దేవి ఆదిత్య వైపు చూస్తూ సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది.

Read Also : Devatha July 9 Today Episode : దగ్గరవుతున్న ఆదిత్య, దేవి.. సత్య మాటలకు షాక్ అయిన ఆదిత్య..? 

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel