Devatha: ఆదిత్య ని తలుచుకొని ఎమోషనల్ అవుతున్న రాధ.. దేవికి దగ్గరవుతున్న ఆదిత్య..?

Devatha: తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధ, ఆదిత్య తో మాట్లాడుతూ నువ్వు నీ బిడ్డకు దగ్గర అవుతున్నావు అని సంతోషపడుతూ ఉంటుంది.

ఈరోజు ఎపిసోడ్ లో భాగ్యమ్మ స్కూల్ దగ్గర దేవి, చిన్మయి లకు పండ్లు ఇస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి భాష వస్తాడు. ఏందీ అత్తమ్మ ఇది తిని ఇంట్లో కూర్చోకుండా ఏమిటిది అని అడగగా ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను ఇలా అయితే పిల్లలను చూస్తూ ఉండవచ్చు అని భాగ్యమ్మ అనడంతో వెంటనే భాగ్య పై అరుస్తాడు భాష.

Advertisement

అప్పుడు భాష రుక్మిణి బతికే ఉంది అని అనగా అప్పుడు భాగ్యమ్మ షాక్ అవుతుంది. దేవుడమ్మకు ఎవరో తెలిసిన వ్యక్తి చెప్పారట అని అనగానే వెంటనే ఊపిరి పీల్చు కుంటుంది. కమల కోసం ఇంటికి రమ్మని భాష అడగగా మళ్ళీ వస్తాను అని చెబుతుంది భాగ్యమ్మ. మరొకవైపు దేవి మాధవ కోసం ఇళ్లంతా వెతుకుతూ ఉంటుంది.

అప్పుడు మాధవ కనిపించేసరికి నాయనా నువ్వు కనిపించట్లేదు పోయేసరికి చాలా భయపడ్డాను అని చెప్పి ఫాదర్స్ డే సందర్భంగా నీకు గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరొకవైపు రాధ పెళ్లి ఫోటో చూసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

ఎలా అయినా దేవిని నీకు దగ్గర చేసి నేను దూరంగా వెళ్ళిపోతాను అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే పిల్లలు మాధవ కోసం వెతుకుతూ ఉండగా మాధవ ఇంట్లో కనిపించకపోయేసరికి ఇంట్లో వారికి చెప్పడంతో వారు కూడా తెగ టెన్షన్ పడుతూ ఉంటారు.

Advertisement

అప్పుడు రాద పిల్లలను స్కూలుకు రెడీ అవమని చెప్పగా వాళ్లు స్కూల్ కి అంటూ మారాం చేయడంతో వెంటనే వాళ్ళని అరిచి స్కూలుకి రెడీ చేయిస్తుంది. ఆ తర్వాత జానకి మాధవరం లెటర్ ని చూసి చదివి ఎమోషనల్ అయ్యి కిందికి వస్తుంది.

అప్పుడు రామ్మూర్తి రాధ లు కూడా ఆ లెటర్ చదివి టెన్షన్ పడుతూ ఉంటారు. మరొకవైపు ఆదిత్య స్కూల్ కి వెళ్లగా అక్కడ దేవి మాధవ కనిపించలేదు అని బాధ పడుతూ ఉండటం తో అప్పుడు ఆదిత్య మాధవ ను ఎలా అయిన వ్యక్తి పట్టుకుంటాను అని దేవి కి మాట ఇస్తాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel