Guppedantha Manasu : జగతి రాకతో తట్టుకోలేకపోతున్న దేవయాని.. ఆనందంలో మహేంద్ర వర్మ!

Updated on: January 26, 2022

Guppedantha Manasu : బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు  ఏం జరిగిందంటే.. జగతి మహేంద్ర ఆరోగ్యం గురించి బాధపడుతూ.. ఆయన తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి ధరణి కి ఫోన్ చేసి లిస్ట్ చెబుతుంది. జాగ్రత్తగా చూసుకోమని ఎమోషనల్ గా బతిమాలుతుంది. ధరణి నేను చూసుకుంటాను అత్తయ్య అని ఫోన్ కట్ చేస్తుంది.

ఇక అక్కడికి గౌతమ్ వచ్చి.. ధరణి మాట్లాడిన మాటలు విని డైటీషియన్ కి ఫోన్ చేశారు అని అనుకుంటాడు. ఇక ధరణి తో ఈ సంక్రాంతికి వసును పిలవాలని అనుకుంటున్నాను అని అనడంతో వెంటనే ధరణి షాక్ అవుతుంది. వెంటనే ధరణి వసు అంటే అత్తయ్య కి పడదు కదా అని అంటుంది. అయినా కూడా గౌతమ్ వినిపించుకోకుండా ఈసారి ఎలాగైనా వసు ఇక్కడకు వస్తుందా సరే..

లేదా నేనే అక్కడికి వెళ్లి తనతో కలిసి భోజనం చేస్తాను అని అంటాడు. ఇక ధరణి తన మనసులో గౌతమ్ గురించి ఆలోచిస్తూ రిషి కి తలనొప్పి రావడం పక్కా అని అనుకుంటుంది. ఇక మరోవైపు రిషి వసు ని తన కారులో ఒకచోటకు తీసుకొని వెళ్తాడు. వసు తో ఒక హెల్ప్ చేయమని అడుగుతూ ఏదో విషయాన్ని చెబుతాడు. వసు నేను చేయలేని సార్ అంటూ.. ఇది మీరు నన్ను అడగాల్సింది కాదని అంటుంది.

Advertisement

Guppedantha Manasu : జగతి రాకతో తట్టుకోలేకపోతున్న దేవయాని..

దాంతో రిషి కాసేపు బాధపడతాడు. ఇంట్లో ఫణీంద్ర వర్మ సంక్రాంతి పండుగ గురించి చర్చలు చేస్తాడు. మరోవైపు రిషి నేరుగా జగతి ఇంటికి వెళ్తాడు. ఇక జగతి రిషిని చూసి షాక్ అవుతుంది. వెంటనే రిషి తనకు ఒక హెల్ప్ చేయమని అడుగుతాడు. ఇక జగతి దానికి ఏం హెల్ప్ సార్ అని ప్రశ్నిస్తుంది. నేను చెప్పింది మీరు కాదనకూడదు మేడం అంటూ.. మా డాడ్ సంతోషం కోసం మీరు మా ఇంటికి రావాలని అడుగుతాడు.

ఆ మాట విన్న జగతి ఆశ్చర్యపోతుంది. సార్ నేను.. ఆ ఇంటికి అంటూ ఎమోషనల్ అవుతుంది. వసు ని కూడా రిషి తన ఇంటికి రమ్మని అంటాడు. తరువాయి భాగం లో జగతి కారు దిగగానే దేవయాని చూసి కోపంతో రగిలిపోతుంది. ఇక దేవయానితో.. నేనే తీసుకువచ్చాను పెద్దమ్మ అన్ని వివరాలు తర్వాత చెబుతానని రిషి అంటాడు. జగతిని చూసినా మహేంద్రవర్మ సంతోషంలో మునిగిపోతాడు.

Advertisement

Read Also : Vastu Tips : ఆఫీస్ లో ఆర్దిక లావాదేవీలు మంచిగా జరగడం లేదా… అయితే ఈ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే !

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel