Karthika Deepam : ఆదిత్యకు ఎదురుపడ్డ మోనిత.. ఏకంగా ఫోన్ ముక్కలు చేసి మరి!

Karthika Deepam : రుద్రాణి మనుషులు వచ్చి పిల్లలతో మాట్లాడటంతో వెంటనే పిల్లలు భయపడి దీపకు జరిగిన విషయాన్ని చెబుతారు. ఇక దీప మనసులో ఆలోచిస్తూ.. పిల్లలతో వాళ్ళు పెద్దవాళ్ళు కదా అని అలాగే అడుగుతారని అంటుంది. ఇక అప్పారావు సినిమాకు వెళ్లాలని కాసేపు యజమానితో మాట్లాడుతూ ఉంటాడు.

మళ్లీ కార్తీక్ దగ్గరికి వచ్చి సినిమాకి వెళ్లాలని ఉందని.. యజమాని అడిగితే ఏదైనా చెప్పమని చెప్పి వెళ్తాడు. ఇక మోనిత ఇంట్లో ఉండగా తన దగ్గరకు భారతి వస్తుంది. ఏం చేయాలనుకుంటున్నావని భారతి అడుగుతూ ఉంటుంది. మాటల మధ్యలో కార్తీక్ చేసిన ఆపరేషన్ గురించి టాపిక్ తీయడంతో భారతి మోనితపై అనుమానం పడుతుంది. ఇక దీప బాబు ని ఎత్తుకొని రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంది.

బాబు తో తన మాటలను పంచుకుంటుంది. డాక్టర్ బాబు డాక్టర్ గా చూసి చాలా రోజులు అయింది అని.. డాక్టర్ లుక్ తో బాగా కనిపిస్తాడని మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో అప్పారావు అక్కడినుంచి వెళ్లటంతో.. అప్పారావు ని చూసి పలకరిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ అని అడగటంతో సినిమాకు వెళ్తున్నాను అక్క అని అంటాడు. హోటల్ లో నా జూనియర్ పని చేస్తున్నాడు అని కాసేపు మాట్లాడతాడు.

Advertisement

Karthika Deepam Today Epidsode Jan 26 : కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్.. 

మోనిత బయట షాపింగ్ కు వెళ్ళినట్లు కనిపించగా అక్కడకు ఆదిత్య కూడా వస్తాడు. ఆదిత్య ని చూసి మోనిత బాగున్నారా మరిది అంటూ వెటకారం గా మాట్లాడుతుంది. ఆదిత్యకు కోపం వస్తూ ఉంటుంది. మోనిత మాత్రం ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. కార్తీక్ గురించి అడుగుతూ ఉంటుంది. ఓపిక నశించిన ఆదిత్య తనకు దండం పెట్టి అక్కడనుంచి వెళ్ళిపోతాడు.

కానీ అక్కడ ఫోన్ మర్చిపోవడం తో ఆ ఫోన్ చూసిన మోనిత తన కారు కింద పెట్టి మరి ముక్కలు చేస్తోంది. హోటల్లో కార్తీక్ పని తీరు చూసి యజమాని తన మనసులో మెచ్చుకుంటాడు. కార్తీక్ పార్సల్ ఇవ్వటానికి వెళ్తున్నానని చెప్పి వెళ్తుండగా.. తాను వెళ్తానని యజమాని అంటాడు. అదే సమయంలో చీటీ కోసం యజమాని దగ్గరికి దీప వస్తుంది. యజమాని బయటికి వెళ్లడంతో లోపల ఉంటుంది. అక్కడ తనకు ఎదురుగా కార్తీక్ టేబుల్ శుభ్రం చేస్తూ కనిపించడంతో దీప ఏవండి అంటూ బాగా ఏడుస్తుంది.

Read Also : Guppedantha Manasu : జగతి రాకతో తట్టుకోలేకపోతున్న దేవయాని.. ఆనందంలో మహేంద్ర వర్మ!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Tufan9 Telugu News And Updates Breaking News All over World

Join our WhatsApp Channel