G
Telugu News » Trending » snake catcher caught 10 feet king cobra video goes viral
⚡ Trending, Latest

Viral video: బుసలు కొడుతూ వచ్చిన పామును ఎలా పట్టుకున్నాడో ఒక్కసారి చూడండి!

Viral video: ప్రపంచ వ్యాప్తంగా పాముల్లో 3,900 జాతులు ఉన్నాయి. అందులో కింగ్ కోబ్రా ఒకటి. ఇది చాలా పొడవుగా ఉంటుంది. అత్యంత విషపూరిత పాముల్లో ఇది కూడా ఒకటి. ఎక్కువ

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Viral video: ప్రపంచ వ్యాప్తంగా పాముల్లో 3,900 జాతులు ఉన్నాయి. అందులో కింగ్ కోబ్రా ఒకటి. ఇది చాలా పొడవుగా ఉంటుంది. అత్యంత విషపూరిత పాముల్లో ఇది కూడా ఒకటి. ఎక్కువగా ఆగ్నేయ ఆసియాలో కనిపించే ఈ కింగ్ కోబ్రా.. అప్పుడప్పుడూ భారతదేశం కనిపించిన సందర్భాలు లేకపోలేదు. దీని కాటుతో మనిషి క్షణాల్లో మరణిస్తాడు. భారీం జంతువైనా కింగ్ కోబ్రా కాటు చంపేస్తుంది. అలాంటి డేంజరస్ పామును ఏ స్నేక్ క్యాచర్ తెలివిగా పట్టుకొని బంధించాడు. ఇది కాస్తా పాత వీడియోనే అయినప్పటికీ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అయితే అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

కర్ణాటకలోని చిక్ మగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ స్థానికంగా ఉండే ఓ ఇంటి వెనుక గోడ వద్ద ఉన్న సిమెంట్ రేకుల వెనుక అడుగుల కింగ్ కోబ్రా నక్కింది. గ్రామస్థులు ఆ పామును చూసి… స్నేక్ క్యాచర్ కు సమాచారాన్ని అందించారు. వెంటనే స్పాట్ కు చేరుకున్న స్నేక్ క్యార్ అర్జున్… ఈ భారీ సైజ్ కింగ్ కోబ్రాను పట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. దాని తోక పట్టుకున్న ప్రతీసారి అది.. అతడి పైకి బుసలు కొడుతూ.. దూసుకొచ్చింది. అయినా కూడా అర్జున్ ఎక్కడా బెదరకుండా పామును పట్టుకున్నాడు. ఓ ప్లాస్టిక్ పైప్ చుట్టూ కవర్ ను చుట్టి దాని గుండా అది వెళ్లేలా చేశాడు. టిలరకు అడుగుల పామును తెలివైన టెక్నిక్ తో బంధించాడు. మీరే ఓసారి ఈ వీడియోపై లుక్కేయండి.

 

Advertisement

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷King Cobra Videosnake latest video viralSnake Viral VideoViral Video
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు