G
Telugu News » Trending » rejected by companies for disability naidhroven built a special scooter for disabled people
⚡ Trending, Latest, Topstory

Success story: అంగవైకల్యం ఉందని ఉద్యోగం ఇవ్వలేదు… కట్ చేస్తే కంపెనీ అధినేత అయ్యాడు?

Success story: చాలామందిలో వివిధ కారణాల వల్ల అంగవైకల్యంతో బాధపడుతూ ఉంటారు.అయితే అంగవైకల్యం వల్ల వారిలో ఎలాంటి నైపుణ్యం ఉండదని వారు దేనికి పనికి రాదు అని తీసేయడం

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Success story: చాలామందిలో వివిధ కారణాల వల్ల అంగవైకల్యంతో బాధపడుతూ ఉంటారు.అయితే అంగవైకల్యం వల్ల వారిలో ఎలాంటి నైపుణ్యం ఉండదని వారు దేనికి పనికి రాదు అని తీసేయడం ఎంతో పొరపాటు. అంగవైకల్యం ఉన్న వారు నేడు దేశం గర్వించే స్థాయిలో ఉన్నారు.అయితే కొన్నిసార్లు ఈ అంగవైకల్యం కారణంగా ఎంతో మంది ఎన్నో అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి అవమానాలు ఎదుర్కొన్న వారిలో నప్పిన్నై కంపెనీ స్థాపకుడు నైద్రోవెన్ ఒకరు.

నైద్రోవెన్ పుట్టుకతోనే మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్నారు.ఎన్నోసార్లు ఎన్నో వైద్యచికిత్సలు చేయించిన అప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆయన కేవలం వీల్ చైర్ కు మాత్రమే పరిమితం అయ్యాడు.అయితే ఇలా వీల్ చైర్ లో ఉన్న అతను అక్కడితో ఆగిపోకుండా మరో మెట్టు ముందుకు వెళ్ళాడు. సంకల్పబలం ఉంటే అవిటితనం మన ముందు తల వంచాలని ఇతను నిరూపించాడు. చదువు రీత్యా ఎంబీఏ పూర్తి చేసిన నైద్రోవెన్ ఏదైనా ఒక ఉద్యోగం చేస్తూ బతుకు కొనసాగించాలని భావించారు.ఈ విధంగా ఈయన ఎన్నో ఉద్యోగాలకు దరఖాస్తు చేయడంతో కేవలం అంగవైకల్యం కారణంగా ఆయనకు ఎలాంటి ఉద్యోగాలు రాలేదు.

ఈ విధంగా ఎన్నో ప్రయత్నాలు చేసిన ఒకటి కూడా విజయవంతం కాకపోవడంతో ఏమాత్రం కృంగిపోకుండా పదేపదే ఆయన పట్టుదలను కొనసాగిస్తూ వచ్చారు.ఈ విధంగా తనకు కాళ్లు లేకపోవడంతో వృత్తిపరంగా ఇంజనీర్ అయిన ఆయన తండ్రి తన కొడుకు ఎవరిపై ఆధారపడకుండా ఉండటం కోసం కంపాక్ట్ స్కూటర్‌ను అభివృద్ధి చేశాడు అయితే దీని సహాయంతో అతను ఎవరిపై ఆధారపడకుండా తన పనిని తాను చేసుకునేవారు. ఈ విధంగా తనకు ఎవరు ఉద్యోగం ఇవ్వకపోవడంతో ఈ ఆలోచనే తనని 2016లో నప్పిన్నై పేరుతో తన కొత్త స్టార్టప్‌ను నైద్రోవెన్ ప్రారంభించాడు. కుటుంబం స్నేహితులు ప్రభుత్వ సహకారంతో ఈ స్టార్టప్ కంపెనీ ప్రారంభించారు.ఈ విధంగా తనకు ఎక్కడైతే ఉద్యోగం ఇవ్వమని రిజెక్ట్ చేశారో అలాంటి వారికి పోటీగా కంపెనీ ప్రారంభించి అందరూ గర్వించే స్థాయిలో ఉన్నారు.

Advertisement

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷disabled peopleE ScooterNaidhrovenNappinnai vehiclesSuccess story
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు