Vijay devarakonda : రౌడీ బాయ్ కు రింగ్ తొడిగిన అమ్మాయి.. వీడియో వైరల్!

Updated on: August 23, 2022

Vijay devarakonda : లైగర్ మూవీ ప్రమోషన్స్ తో హీరో విజయ్ దేవరకొండ ఫుల్ బిజీ అయిపోయారు. హీరోయిన్ అనన్య పాండేతో కలిసి మరీ దేశం మొత్తాన్ని చుట్టేస్తున్నాడు. ఈ క్రమంలోనే బెంగళూర్ వెళ్లాడు రౌడీ బాయ్. అక్కడే ఓ అనుకోని సంఘటన జరిగిది. అది చూసిన ప్రతీ ఒక్కరూ తెగ ఆశ్చర్యానికి గురయ్యారు. అంతే కాదండోయ్ చాలా హ్యాపీగా కూడా ఫీలయ్యారు. అయితే అసలు అక్కడ ఏం జరిగిందో మన ఇప్పుడు తెలుసుకుందాం.

girl-fan-proposed-vijay-devarakonda-in-liger-promotions
girl-fan-proposed-vijay-devarakonda-in-liger-promotions

 

అర్జున్ రెడ్డి సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన విజయ్ కు ఓ గర్ల్ ఫ్యాన్ ప్రపోజ్ చేసింది. మోకాళ్లపై కూర్చొని మరీ ఉంగరం తొడిగింది. తన అభిమాన హీరోను కలిసినందుకు ఉద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది. అయితే అది మీరు అనుకున్నట్లు ఏడుపు కాదండోయ్.. ఆనంద భాష్పాలు. దీంతో విజయ్.. ఆమెను హత్తుకొని ఓదార్చాడు. అతేకాదు ఉగరాన్ని ఉంగరాన్ని లైగర్ మూవీ ప్రమోషన్స్ పూర్తయ్యే వరకు ఉంచుకుటానని మాటిచ్చాడు.

Advertisement

అయితే ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన లైగర్ సినిమా ఆగస్టు 25న తేదీన విడుదల కాబోతున్న విషయ అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో విజయ్ కు సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటించింది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel