G
Telugu News » Trending » economics graduate start a tea point in patna for no job
⚡ Trending, Latest, Topstory

Chaiwalla Patna : చాయ్ వాలాగా మారిపోయిన ఈ అమ్మాయి గురించి తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే!

Chaiwalla Patna : బిహార్ రాజధాని పట్నాలోని ఉమెన్స్ కాలేజీ ఎదుట ఓ యువతి టీ దుకాణం ప్రారంభించింది. అయితే ఆ ప్రాంతంలో అప్పటికే చాలా టీ దుకాణాలున్నాయి. కానీ ఈమె అక్

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Chaiwalla Patna : బిహార్ రాజధాని పట్నాలోని ఉమెన్స్ కాలేజీ ఎదుట ఓ యువతి టీ దుకాణం ప్రారంభించింది. అయితే ఆ ప్రాంతంలో అప్పటికే చాలా టీ దుకాణాలున్నాయి. కానీ ఈమె అక్కడే ఎందుకు టీ దుకాణం ప్రారంబించింది.. చూస్తే చదువుకున్న అమ్మాయిలా ఉందని అంతా భావించారు. అదే ప్రశ్నని ఆమెని అడగ్గా… ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశానని.. ఉద్యోగం లేక స్వయం ఉపాధి కోసం చాయ్ వాలాగా మారానని తెలిపింది. అయితే ఆమె అందించే రుచికరమైన చాయ్​ తాగుతూ, ఆమె కథ వింటూ.. ఔరా అంటున్నారు.

ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తనకు స్వయం ఉపాధి కోసం చాలా ఆలోచించింది. చివరకు చాయ్ దుకాణం పెట్టాలని నిర్ణయించుకుంది. అయితే టీ దుకామం పెట్టేందుకు డబ్బులు లేవు. ఎలా నిర్వహించాలో కూడా ఆమెకు తెలియదు. అయితే యూట్యూబ్ ను గురువుగా చేసుకొని టీ దుకాణం పెట్టాలనుకుంటిది.

Chaiwalla Patna

రెండు నెలలపాటు నగరంలోని చిన్నచిన్న టీ దుకాణాలకు వెళ్లి.. అక్కడి వ్యాపార శైలిని అర్థం చేసుకుంది. బిజినెస్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించి.. ముద్రా యోజన కింద లోన్​ కోసం బ్యాంక్​కు వెళ్లింది. అయితే.. స్థానికురాలు కాదు కాబట్టి రుణం ఇవ్వలేమన్నారు బ్యాంక్ సిబ్బంది. స్నేహితుల సాయంతో రూ.30వేలు సమకూర్చుకుని.. ఎట్టకేలకు తన కలల చాయ్ దుకాణం తెరిచింది. అందరి చేత శెభాష్ అనిపించుకుంటోంది.

ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు టీ దుకాణం నడుపుతోంది ప్రియాంక. మసాలా చాయ్, అల్లం చాయ్, పాన్ చాయ్, చాక్లెట్​ చాయ్​ సహా మొత్తం ఐదు రకాల టీలు అందిస్తోంది. త్వరలో సాయంత్రం వేళల్లోనూ టీ దుకాణం నిర్వహించాలని భావిస్తోంది. చాయ్​వాలీగా మారిన వారం రోజుల తర్వాత ఇంట్లో వారికి ప్రియాంక అసలు విషయం చెప్పింది. టీ దుకాణం నడపడం ఏంటని తొలుత తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పినా.. చివరకు కుమార్తెతో ఏకీభవించారు. తమ పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు.

Advertisement

Read Also : Kajal Aggarwal : ఫ్యాన్స్‌కు పండగే.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్..!

Vinod Kumar ✓

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷chaiwala in patnagraduate start tea pointstudent start a tea point
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు