G
Telugu News » Technology » whatsapp down whatsapp services down on october 25 across worldwide did you check your device
⚡ Technology, Latest, Trending

Whatsapp Down : యూజర్లకు షాకింగ్ న్యూస్.. నిలిచిపోయిన వాట్సాప్ సర్వీసులు.. మీ డివైజ్ చెక్ చేసుకున్నారా?

Whatsapp Down, Whatsapp Outage, Whtasapp services down, నిలిచిపోయిన వాట్సాప్ సర్వీసులు, వాట్సాప్ సేవలు బంద్, ఆ డివైజ్‌ల్లో వాట్సాప్ సేవలు పనిచేయవు

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Whatsapp Down : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ (Whatsapp) సర్వీసులు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దాదాపు గంట నుంచి వాట్సాప్ సర్వీసులు పనిచేయడం లేదు. ఐఫోన్, ఆండ్రాయిడ్ డివైజ్‌ల్లో కొన్ని స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ సర్వీసులు నిలిపివేయనున్నట్టు ఇటీవలే మెటా యాజమాన్యంలోని ఫేస్‌బుక్ వెల్లడించింది.

Whatsapp Down _ whatsapp Services Down On October 25 Worldwide, Did You Check Your Device

ఈ ఫోన్ డివైజ్ మోడళ్లలో అక్టోబర్ 24 నుంచి తమ సర్వీసులను నిలిపివేయనున్నట్టు వెల్లడించింది. అందులోభాగంగానే అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ డివైజ్‌ల్లో సర్వీసులు నిలిచిపోయాయి. వాట్సాప్ యూజర్లు తమ మెసేజ్ లను పంపేందుకు ప్రయత్నిస్తే.. వెయిటింగ్ సింబల్ అలానే ఉంటుంది. మెసేజ్ డెలివరీ కావడం లేదని యూజర్లు ఫిర్యాదులు చేస్తున్నారు.

Advertisement

iOS 10, iOS 11 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఐఫోన్లలో ఇప్పటినుంచి వాట్సాప్ పనిచేయదు. ఇప్పటినుంచి iPhone 4, iPhone 4S, iPhone 5, iPhone 5C ఫోన్లలో ఈ వాట్సాప్ సర్వీసులు పనిచేయవు. ఆపిల్ నిబంధనలు ప్రకారం.. iPhone 4, iPhone 4S డివైజ్ ల్లో ఇకపై OS అప్ డేట్ కాదని కంపెనీ తెలిపింది.

iPhone 5, iphone 5C మోడళ్లలో మాత్రమే OS అప్ డేట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంది. అందుకే ఐఫోన్ యూజర్లు తమ ఫోన్లలో iOS 12 వెంటనే అప్ డేట్ చేసుకోవాలని వాట్సాప్ సూచిస్తోంది.

ఆండ్రాయిడ్ యూజర్లు కూడా 4.04 వెర్షన్ OSతో రన్ అవుతున్న ఫోన్లలో వాట్సాప్ సర్వీసులు నిలిచిపోయాయి. ఆ తర్వాత వాట్సాప్ వెర్షన్‌కు తమ డివైజ్ లను అప్ డేట్ చేసుకోవాల్సిందిగా వాట్సాప్ సూచించింది.

Advertisement

WhatsApp services have been down for the last 30 minutes. pic.twitter.com/9WL4mMFTRO

— ANI (@ANI) October 25, 2022

Read Also : Spam Calls : స్పామ్ కాల్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷Whatsapp DownWhatsapp OutageWhtasapp services down
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు