Vivo T4 5G : ఈ వివో స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్.. క్రేజీ ఆఫర్లు, ధర ఎంతో తెలిస్తే కొనేస్తారంతే!కొత్త వివో ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. మీరు స్మార్ట్‌ఫోన్ (Vivo T4 5G Sale Offer) కొనాలని చూస్తున్నారా? ఇదే అద్భుతమైన అవకాశం. వివో T4 5G మోడల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ వివో ఫోన్ భారీ 7000mAh బ్యాటరీతో వస్తుంది.
6.7-అంగుళాల Full HD అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 2GB RAM, 50MP కెమెరా ఉన్నాయి. కెమెరా క్వాలిటీ అద్భుతంగా ఉంది. ఇప్పుడు వివో T4 5G స్మార్ట్‌ఫోన్ ధర, ఆఫర్‌లు, స్పెసిఫికేషన్‌లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వివో ఫోన్ అతి తక్కువ ధరకే ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Vivo T4 5G ఫీచర్లు, స్పెషిఫికేషన్లు :
వివో T4 5G స్మార్ట్‌ఫోన్ 6.77-అంగుళాల క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 1080×2392 పిక్సెల్స్ (FHD+) రిజల్యూషన్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ వివో ఫోన్ పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ వివో ఫోన్ ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజీని కలిగి ఉంది.
డ్యూయల్ సిమ్ (GSM + CDMA, GSM + CDMA) స్మార్ట్‌ఫోన్. నానో సిమ్, నానో సిమ్ కార్డులతో వస్తుంది. కొలతలు 163.40 x 76.40 x 7.89mm, బరువు 199.00 గ్రాములు. వివో T4 5G ఫోన్ ఎమరాల్డ్ బ్లేజ్, ఫాంటమ్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దుమ్ము, నీటి రక్షణ కోసం IP65 రేటింగ్ కలిగి ఉంది.
కనెక్టివిటీ విషయానికి వస్తే.. :
వివో T4 5Gలో Wi-Fi, GPS, ఇన్‌ఫ్రారెడ్ డైరెక్ట్, USB OTG, USB టైప్ C పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో యాంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, కంపాస్, మాగ్నెటోమీటర్, గైరోస్కోప్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఈ వివో V4 5G ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.

ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఈ వివో ఫోన్‌లో ఆరా లైట్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ వివో ఫోన్ 7,300mAh బ్యాటరీని కలిగి ఉంది. 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
Vivo T4 5Gపై డిస్కౌంట్ ఆఫర్ :
వివో స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ వివో ఫోన్ అసలు ధర రూ. 29,999 ఉండగా, మీరు కేవలం రూ. 25,999కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ ఫోన్ 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ కలిగి ఉంది.
8GB RAM వేరియంట్ కేవలం రూ. 23,999కు లభ్యమవుతుంది. ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.1500 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధరను మరింత తగ్గింపు పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు.