G
Telugu News » Technology » say goodbye to the password only one password to all apps
⚡ Technology, Latest, Topstory

Password : ఇక పై పాస్ వర్డ్ కి గుడ్ బై… అన్ని యాప్స్ కి ఓకే పాస్ వర్డ్!

Password : రోజురోజుకు సైబర్ నేరగాళ్లు విపరీతంగా ఎంతోమంది పాస్ వర్డ్ లను హ్యాక్ చేస్తూ పెద్ద ఎత్తున మోసాలకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మోసాలకు చెక్ పెట్టడం

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

Password : రోజురోజుకు సైబర్ నేరగాళ్లు విపరీతంగా ఎంతోమంది పాస్ వర్డ్ లను హ్యాక్ చేస్తూ పెద్ద ఎత్తున మోసాలకు తెరలేపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ మోసాలకు చెక్ పెట్టడం కోసం పాస్‌వర్డ్‌ లేని లాగిన్‌  వ్యవస్థ ఉంటే ఎలా ఉంటుంది. ఇలా పాస్‌వర్డ్‌ లేకుండా ఉన్నప్పుడు ఇలాంటి మోసాలకు చెక్ పెట్టవచ్చు. ఈ క్రమంలోనే ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలు అన్నీ ఇదే దిశ వైపు అడుగులు వేస్తున్నాయి. ఒక యాప్ కు సపరేట్ పాస్ వర్డ్ కాకుండా అన్ని యాప్స్ కి కలిపి ఓకే యూనిక్ పాస్వర్డ్ ఉండే విధంగా చర్యలు తీసుకోనున్నారు.

ఈ క్రమంలోనే ఆపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలు పాస్‌వర్డ్‌లెస్‌ సైన్‌ఇన్‌ టెక్నాలజీని తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి.విండోస్‌, క్రోమ్‌ఓఎస్‌, మ్యాక్‌ఓఎస్‌ వంటి భిన్న డివైజ్‌లలో యాప్స్‌, వెబ్‌సైట్లలో ఒకేసారి లాగిన్ అయితే ఎంతో సురక్షితమైన ఈ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు ఇలా ఒక సారి లాగిన్ అయితే అన్ని సైట్లు, యాప్‌లకు యాక్సెసింగ్‌ లభిస్తుంది. పనిపూర్తయిన తర్వాత లాగౌట్ అవ్వచ్చు.

Say Goodbye to the password only one password to all apps

ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ లో మనం ఉపయోగిస్తున్న ఎటువంటి ఫింగర్ ప్రింటింగ్ ఫేస్ స్కాన్ వంటి లాగిన్ ద్వారా  ‘పాస్‌వర్డ్‌లెస్‌ సైన్‌ఇన్‌’ టెక్నాలజీలోకి లాగిన్‌ కావొచ్చు. ఇలా లాగిన్ కావాలంటే ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధమైనటువంటి పాస్ వర్డ్ లెస్ సైన్ ఇన్ టెక్నాలజీ తీసుకువస్తే ఎన్నో సైబర్ నేరగాళ్ల మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చు. త్వరలోనే యాపిల్ గూగుల్ మైక్రోసాఫ్టు వంటి కంపెనీలు మరికొన్ని అధునాతనమైన ఫీచర్లు జోడించి దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు.

Read Also : Anchor Anasuya: వామ్మో.. ఒక్కరోజు కాల్షీట్ కోసం అనసూయ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Advertisement

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷apps lockGoogleMicrosoftPass WordTollywood
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు