Realme P4 Pro 5G : కొత్త రియల్‌మి సిరీస్ వచ్చేస్తోంది. రియల్‌మి P4 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఆగస్టు 20, 2025న భారత మార్కెట్లో లాంచ్ అయ్యేందుకు (Realme P4 Pro 5G) రెడీగా ఉంది. ఈ లైనప్‌లో రియల్‌మి P4 5G, రియల్‌మి P4 ప్రో 5G ఫోన్లు లాంచ్ కానున్నాయి.
ఫ్లిప్‌కార్ట్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా లభ్యం కానున్నాయి. అయితే, లాంచ్‌కు ముందే కంపెనీ ఈ రెండు మోడళ్లకు సంబంధించిన కొన్ని కీలక ఫీచర్లు, కెమెరా కాన్ఫిగరేషన్‌లను రివీల్ చేసింది. రియల్‌మి P4 5G ఫోన్ ఇంకా ఏయే ఫీచర్లతో రానుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Realme P4 Pro 5G : రియల్‌మి P4 ప్రో 5G మొబైల్ సిరీస్ కెమెరాలు :
రియల్‌మి P4 ప్రో 5Gలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP సోనీ IMX896 సెన్సార్ కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీల కోసం 50MP OV50D సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ప్రో మోడల్ 60 FPS వద్ద 4K వీడియో రికార్డింగ్, 30 FPS వద్ద 4K HDR రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
రియల్‌మి హైపర్‌షాట్ ఆర్కిటెక్చర్‌ను అల్ట్రా స్టెడీ వీడియో, ఏఐ మోషన్ స్టెబిలైజేషన్‌తో ఇంటిగ్రేట్ అయింది. ఈ 2 స్మార్ట్‌ఫోన్‌లు ఏఐ స్నాప్ మోడ్‌లో ఏఐ ట్రావెల్ స్నాప్, ఏఐ ల్యాండ్‌స్కేప్‌ను కలిగి ఉంటాయి.
Read Also : War 2 Movie Review : వార్ 2 మూవీ రివ్యూ.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ సినిమా ఎలా ఉందంటే?
మరోవైపు, స్టాండర్డ్ రియల్‌మి P4 5G ఫోన్ బ్యాక్ సైడ్ 50MP మెయిన్ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్ కలిగి ఉంటుంది. 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ప్రో వేరియంట్‌తో AI- అసిస్టెంట్ కెమెరా ఫీచర్లతో రానుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ సైడ్ 16MP కెమెరాను కూడా కలిగి ఉండొచ్చు.
Realme P4 Pro 5G : రియల్‌మి P4 ప్రో 5G సిరీస్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు (అంచనా) :
గత టీజర్ల ప్రకారం.. ఈ సిరీస్ అనేక స్పెసిఫికేషన్లతో రానుంది. రియల్‌మి P4 ప్రో 5G హైపర్‌విజన్ AI GPUతో స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ ద్వారా పవర్ కలిగి ఉంది. 7,000 చదరపు మిమీ ఎయిర్‌ఫ్లో VC కూలింగ్ సిస్టమ్ థర్మల్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది.
ముఖ్యంగా గేమింగ్ సమయంలో ఈ ఫోన్ కూలింగ్ కలిగి ఉంటుంది. 7.68 మిమీ మందం, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 10W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAH బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్ ఛార్జ్‌పై 90fps వద్ద 8 గంటల వరకు బాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్‌ప్లే కలిగి ఉంటుంది.
రియల్‌మి రెండు ఫోన్లు 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సర్టిఫికేషన్, 6,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో హైపర్‌గ్లో అమోల్డ్ 4D కర్వ్+ డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. డిస్‌ప్లే 4,320Hz హై-ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్, టీయూవీ రీన్‌ల్యాండ్-సర్టిఫైడ్ ఐ ప్రొటెక్షన్‌కు కూడా సపోర్టు ఇస్తుంది.
రియల్‌మి P4 5G, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా 5G చిప్‌సెట్, స్పెషల్ పిక్సెల్‌వర్క్స్ ప్రాసెసర్‌తో వస్తుంది. ఫుల్-HD+ రిజల్యూషన్‌తో 6.77-అంగుళాల హైపర్‌గ్లో అమోల్డ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది.
హార్డ్‌వేర్ లెవల్‌లో 3,840Hz PWM డిమ్మింగ్, బ్లూ లైట్ రిడక్షన్, ఫ్లికర్ కంట్రోల్‌ను అందిస్తుంది. ఈ వేరియంట్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,000mAh టైటాన్ బ్యాటరీ కూడా ఉంది. 25 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ అవుతుంది. 11 గంటల వరకు BGMI గేమ్‌ప్లేను అందిస్తుంది. రియల్‌మి P4 5G ప్రో మోడల్ మాదిరిగానే కూలింగ్ సిస్టమ్ కలిగి ఉంది. రివర్స్ ఛార్జింగ్, ఏఐ స్మార్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి.