G
Telugu News » Technology » one plus 10 pro launched in the market admirable features
⚡ Technology, Latest

One Plus10 Pro: మార్కెట్లోకి విడుదలైన వన్ ప్లస్ 10 ప్రో… అదిరిపోయే ఫీచర్స్..!

One Plus10 Pro: భారత స్మార్ట్ ఫోన్ రంగంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వన్‌ప్లస్‌ ఇటీవల వరుసగా కొత్త ఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది.ఇప్పటికే ఎన్నో రకాల

Tufan9 Telugu NewsAdd as preferredsource on Google

One Plus10 Pro: భారత స్మార్ట్ ఫోన్ రంగంలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వన్‌ప్లస్‌ ఇటీవల వరుసగా కొత్త ఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది.ఇప్పటికే ఎన్నో రకాల ఫీచర్స్ తో వినియోగదారులకు అందుబాటులోకి రాగానే తాజాగా వన్ ప్లస్ 10 ప్రో అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి విడుదలైంది. అధునాతనమైన ఫీచర్లతో నేడు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ మార్కెట్లో, ఈ కామర్స్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ఎన్నో అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం…

వన్ ప్లస్ 10 ప్రో స్మార్ట్ ఫోన్ 6 .7 ఇంచెస్ క్యూహెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌ను కూడా అందించారు.80 వాట్స్‌ సూపర్‌ వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ కేవలం 15 నిమిషాలు చార్జింగ్ చేస్తే మనకు 70 శాతం బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. కెమెరా విషయానికొస్తే 48 మెగాఫిక్సల్ బ్యాక్ కెమెరాతో పాటు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

ఇక ఈ ఫోన్లో వీడియో రికార్డింగ్ కోసం మూవీ మోడ్‌ అనే ఫీచర్‌ను ప్రత్యేకంగా ఇచ్చారు. దీంతో హైక్వాలిటీ ఫోటోలను తీసుకోవచ్చు. ఇక నేడు మార్కెట్లోకి విడుదలైన 5 జీ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో ఉంది.
8 జీబీ ర్యామ్‌+128 జీబీ స్టోరేజ్‌ కలిగి ఉన్న స్మార్ట్ ఫోన్ ధర 66,999 కాగా,12 జీబీ+256 జీబీ ధర రూ. 71,999గా ఉంది. ఇలాంటి అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ నేటి (ఏప్రిల్ 5వ తేదీ) నుంచి ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అయిన అమెజాన్ లో అందుబాటులో ఉంది.

Ramesh Babu ✓

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

🏷new modelnew phoneOne Plus10 Pro
◉f➤𝕏
◉   WhatsApp ChannelJoin Now
➤   Telegram ChannelJoin Now

తాజా వార్తలు