Apple iPhone16 : ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డిస్కౌంట్.. ఆపిల్ ఐఫోన్ 16పై రూ. 10,000 భారీ తగ్గింపు.. ఫీచర్ల కోసమైన కొనేయండి!

Apple iPhone16 : మీరు ఆపిల్ అభిమాని అయితే మీకో గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 అతి తక్కువ ధరకే కొనేసుకోండి. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 16పై రూ. 10,000 భారీ తగ్గింపుతో అందిస్తోంది. అయితే, ఇప్పుడు ఈ ఐఫోన్‌ను కేవలం రూ. 69,999కు కొనుగోలు చేయవచ్చు. కొన్ని బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

తద్వారా ఈ ఐఫోన్ 16 ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 16లో సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే కూడా ఉంది. సిరామిక్ షీల్డ్ గ్లాస్‌తో వస్తుంది. 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్-యాంగిల్ కెమెరా కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16పై ఆఫర్లు, ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

Apple iPhone16 : ఐఫోన్ 16పై డిస్కౌంట్ ఆఫర్ :

గత ఏడాది సెప్టెంబర్‌లో ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ బేస్ మోడల్‌ను రూ.79,900 ప్రారంభ ధరకు లాంచ్ చేసింది. అయితే, ప్రస్తుతం ఈ ఐఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ.69,999కు కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు.. కంపెనీ ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. మీరు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ ద్వారా రూ.1250 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ఐఫోన్ మరింత తక్కువ ధరకు పొందవచ్చు.

Advertisement

Read Also : Hyundai Alcazar : మీ ఫ్యామిలీ కోసం 7 సీట్ల SUV కారు.. హ్యుందాయ్ అల్కాజార్ SUVపై భారీ డిస్కౌంట్.. డోంట్ మిస్!

ఆపిల్ కంపెనీ BOBCARD ద్వారా పేమెంట్లపై రూ. 3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఆ తర్వాత ఐఫోన్ ధర కేవలం రూ. 66,999కి తగ్గుతుంది. ఈ ఐఫోన్‌పై ప్రత్యేక ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. సైట్‌లో చెక్ చేస్తే మీ పాత ఐఫోన్ 11 ఎక్స్ఛేంజ్ చేసుకుంటే.. రూ. 15,350 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, ఈ ఎక్స్ఛేంజ్ వాల్యూ మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

Apple iPhone16 : ఐఫోన్ 16 ఎందుకు బెటర్? :

ఆపిల్ నుంచి వచ్చిన ఈ అద్భుతమైన ఐఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్, 6.10-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌‌ప్లే కలిగి ఉంది. రిజల్యూషన్ 1179×2556 పిక్సెల్స్, హెక్సా-కోర్ ఆపిల్ A18 ప్రాసెసర్‌ను కలిగి ఉంది.

Advertisement

ఈ ఐఫోన్ బేస్ మోడల్‌లో 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగి ఉంది. ఐఫోన్ 16 వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. ఈ ఫోన్ అద్భుతంగా ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 48MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్-యాంగిల్ కెమెరా కూడా కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 12MP కెమెరా కూడా ఉంది.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel