Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Apple iPhone 16 : సూపర్ ఆఫర్లు భయ్యా.. ఆపిల్ ఐఫోన్ 16 మోడళ్లపై బిగ్ డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనండి..!

Apple iphone 16 price drop

Apple iphone 16 price drop

Apple iPhone 16 : ఆపిల్ లవర్స్ కోసం అద్భుతమైన ఆఫర్లు.. ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లతో అందుబాటులో ఉంది. మీరు కొత్త ఐఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడే కొనేసుకోండి. ఐఫోన్ 16e నుంచి ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లతో లభ్యమవుతున్నాయి. ఈ ఐఫోన్ మోడళ్లను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, రిలయన్స్ డిజిటల్ జియోమార్ట్‌ల నుంచి అతి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 16 సిరీస్ మోడళ్లపై డీల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఐఫోన్ 16e ధర, ఆఫర్లు :
అమెజాన్‌లో ఐఫోన్ 16e ఫోన్ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.50,999కి అందుబాటులో ఉంది. అయితే ఫిబ్రవరి 2025లో రూ.59,900కి లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్లతో HDFC బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై ఫ్లాట్ రూ.1500 తగ్గింపును పొందవచ్చు. ఆ తర్వాత ధర రూ.49,499కి తగ్గింది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో పాత ఫోన్‌తో అదనంగా రూ.47,150 ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం, ఈ ఐఫోన్ లాంచ్ ధర ప్రకారం దాదాపు రూ.10,401 చౌకైన ధరకే సొంతం చేసుకోవచ్చు.

Apple iPhone 16 : ఐఫోన్ 16 ధర, ఆఫర్లు :

ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 16 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.69,999కి అందుబాటులో ఉంది. గత ఏడాదిలో ఈ ఐఫోన్ రూ.79,900కి లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై రూ.4500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. తద్వారా ధర రూ.65,499 అవుతుంది. ఈ ఐఫోన్ లాంచ్ ధర కన్నా రూ.14,401 వరకు తక్కువ ధరకు లభిస్తుంది. పాత లేదా ఇప్పటికే ఉన్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ద్వారా రూ.46,150 అదనపు సేవింగ్ పొందవచ్చు.

Advertisement

ఐఫోన్ 16 ప్లస్ ధర, ఆఫర్లు :

ఐఫోన్ 16 ప్లస్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.79,999కి అందుబాటులో ఉంది. అయితే, గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.89,900కి లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్‌ల విషయానికి వస్తే.. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.4500 తగ్గింపు పొందవచ్చు. ఆ తర్వాత ధర రూ.75,499కి తగ్గుతుంది. మీ పాత లేదా ఇప్పటికే ఉన్న ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఇవ్వడం ద్వారా మీరు రూ.59,500 సేవ్ చేసుకోవచ్చు. ఈ ఐఫోన్ లాంచ్ ధర కన్నా రూ.14,401 చౌకగా పొందవచ్చు.

Read Also : Samsung Galaxy S24 Ultra 5G : వావ్.. అమెజాన్‌లో కిర్రాక్ ఆఫర్ భయ్యా.. భారీగా తగ్గిన శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ఫోన్..

Apple iPhone 16 : ఐఫోన్ 16 ప్రో ధర, ఆఫర్లు :
ఐఫోన్ 16 ప్రో 128GB స్టోరేజ్ వేరియంట్ రిలయన్స్ డిజిటల్‌లో రూ.1,07,199కి అందుబాటులో ఉంది. అయితే, సెప్టెంబర్ 2024లో ఈ ఐఫోన్ రూ.1,19,900కి లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. IDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ లావాదేవీలపై ఫ్లాట్ రూ.10వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఆ తర్వాత ధర రూ.97,199 తగ్గుతుంది. ఆపిల్ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్‌ను లాంచ్ ధర కన్నా మొత్తం రూ.22,701 తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.

Advertisement

Apple iPhone 16 : ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర, ఆఫర్లు :

ఆపిల్ ఐఫోన్ 16 ప్రో మాక్స్ 256GB స్టోరేజ్ వేరియంట్ జియోమార్ట్‌లో రూ.130,990కు అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ (Apple Website) గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.1,44,900కు లాంచ్ అయింది. బ్యాంక్ ఆఫర్ల విషయానికి వస్తే.. బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ లావాదేవీలపై 7.5 శాతం తగ్గింపు (రూ.7000 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత ధర రూ.1,23,990కి తగ్గుతుంది. ఈ ఐఫోన్ లాంచ్ ధర కన్నా మొత్తం రూ.21,000 తక్కువ ధరకు పొందవచ్చు.

ఐఫోన్ 16e ధర ఎంత?
ఐఫోన్ 16e మోడల్ 128GB స్టోరేజ్ వేరియంట్ అమెజాన్‌లో రూ.50,999కి అందుబాటులో ఉంది.
ఐఫోన్ 16 ధర ఎంత?
ఐఫోన్ 16 ఫోన్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.69,999కి అందుబాటులో ఉంది.
Apple iPhone 16 : ఐఫోన్ 16 ప్లస్ ధర ఎంత?
ఐఫోన్ 16 ప్లస్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.79,999కి అందుబాటులో ఉంది.
ఐఫోన్ 16 ప్రో ధర ఎంత? :
ఐఫోన్ 16 ప్రో 128GB స్టోరేజ్ వేరియంట్ రిలయన్స్ డిజిటల్‌లో రూ.1,07,199కి అందుబాటులో ఉంది.
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర ఎంత? :
ఐఫోన్ 16 ప్రో మాక్స్ 256GB స్టోరేజ్ వేరియంట్ జియోమార్ట్‌లో రూ.130,990కి అందుబాటులో ఉంది.

Advertisement
Exit mobile version