Airtel Prepaid Apple Music : ఎయిర్‌టెల్ అద్భుతమైన ఆఫర్.. ఈ యూజర్లు ఆపిల్ మ్యూజిక్‌ ఫ్రీగా పొందొచ్చు!

Updated on: September 25, 2025

Airtel Prepaid Apple Music : ఎయిర్‌టెల్ అద్భుతమైన ఆఫర్. ఇప్పుడు ఎయిర్‌టెల్ యూజర్ల కోసం ఆపిల్ మ్యూజిక్‌కు ఫ్రీగా యాక్సెస్ అందిస్తోంది. మీరు ఎయిర్‌టెల్ (Airtel Prepaid Apple Music) యూజర్ అయితే ఈ వార్త మీకోసమే. వాస్తవానికి, భారత అతిపెద్ద టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది.

ఆసక్తిగల వినియోగదారులు ఆపిల్ మ్యూజిక్‌ను ఫ్రీగా పొందవచ్చు. వెంటనే క్లెయిమ్ చేసుకోవాలి. మీ సమాచారం కోసం ఎయిర్‌టెల్ గత ఏడాది ఆపిల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కింద ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ టీవీ +లకు ఫ్రీ యాక్సెస్ అందిస్తోంది. ఇప్పుడు ప్రీపెయిడ్ యూజర్ల కోసం తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Airtel Prepaid Apple Music : గతంలో ఈ యూజర్లకు మాత్రమే :

ఎయిర్‌టెల్ వై-ఫై పోస్ట్‌పెయిడ్ సర్వీసులను పొందుతున్న వారికి ఆపిల్ ఇప్పటికే ఆపిల్ మ్యూజిక్, యాప్ టీవీ ప్లస్‌లకు ఫ్రీ యాక్సెస్‌ను అందిస్తోంది. ఇప్పుడు ప్రీపెయిడ్ యూజర్లు పెరిగారు. అయితే, ఈ ఆఫర్ కింద ప్రీపెయిడ్ యూజర్లు ఆపిల్ మ్యూజిక్ సౌకర్యాన్ని మాత్రమే పొందుతున్నారు.

Advertisement

Read Also : Redmi 15 5G : 7,000mAh భారీ బ్యాటరీ, AI ఫీచర్లతో రెడ్‌మి 15 5G వస్తోంది.. ధర ఎంత ఉండొచ్చంటే?

Airtel Prepaid Apple Music : ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ 6 నెలలు ఫ్రీ :

టెలికామ్‌టాక్ రిపోర్టు ప్రకారం.. ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో వినియోగదారులకు బిగ్ సర్‌ప్రైజ్ అందిస్తోంది. వాస్తవానికి, యాప్‌లో ఒక బ్యానర్ కనిపిస్తుంది. ఇందులో వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా మొత్తం 6 నెలలు ఆపిల్ మ్యూజిక్‌కు ఫ్రీగా సభ్యత్వాన్ని పొందవచ్చు. అయితే, ఈ ఆఫర్‌కు సంబంధించి ఎయిర్‌టెల్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ప్రీపెయిడ్ యూజర్లు ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. 6 నెలల ఫ్రీ ట్రయల్ ముగిసిన తర్వాత వినియోగదారులు నెలకు రూ. 119 ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఆపిల్ మ్యూజిక్ నెల ప్లాన్ రూ. 119కి వస్తుందని గమనించాలి. ఎయిర్‌టెల్ వినియోగదారులు రూ. 714 వరకు ఆదా చేయవచ్చు. ఆ తర్వాత యాడ్స్ లేకుండా మిలియన్ల కొద్దీ పాటలను ఆశ్వాదించవచ్చు.

Advertisement

ఈ ఆఫర్ ఏయే కస్టమర్లకు అందుబాటులో ఉందో ఎయిర్‌టెల్ ప్రస్తుతానికి స్పష్టంగా లేదు. మీ ఎయిర్‌టెల్ థాంక్స్ (Airtel Thanks) యాప్‌కి వెళ్లి ఈ బ్యానర్ కోసం సెర్చ్ చేయండి. ఈ ఆఫర్ కనిపిస్తే మీరు అక్కడి నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. (Airtel Perplexity AI)లో ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా అందుబాటులో ఉంది. కంపెనీ ఇటీవల యూజర్లకు Perplexity AI ఫ్రీ సభ్యత్వాన్ని అందించింది. ఈ ప్లాన్ ధర రూ. 17 వేలు ఉంటుందని అంచనా.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel