Ys Jagan : ఏపీలో ఏం జరగబోతోంది..? వైసీపీని నవరత్నాలు సేవ్ చేస్తాయా..?

Updated on: November 29, 2021

Ys Jagan : 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తిరుగులేని మెజార్జీ సాధించింది. ఎవరితో పొత్తు లేకుండానే సోలోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అప్పటికే ప్రజల్లో జగన్‌కు విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. ఇక ప్రజలను పార్టీని మరింత దగ్గర చేసేందుకు సంక్షేమ పథకాలపై ఎక్కువగా దృష్టి సారించారు సీఎం వైఎస్ జగన్. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలకు చేరువ చేశారు. కానీ సంక్షేమ పథకాలే ప్రభుత్వాన్ని కాపాడలేవు.

ఇదే విషయాన్ని ప్రస్తుతం వైసీపీ పార్టీ గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రతిపక్షంలో ఉన్న వారు సాధారణంగా అధికారంలో ఉన్న తీరుపై విమర్శలు చేయడం కామన్. అందుకు రిప్లైగా అధికార పార్టీ నాయకులు సైతం కౌంటర్స్ వేస్తుంటారు. కానీ తాజాగా ఏపీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఎందుకో హద్దులు దాటుతున్నట్టు అనిపిస్తోంది. విమర్శలు చేసే సమయంలో నాయకులు కంట్రోల్ తప్పుతున్నారు.

ఇదిలా ఉండగా.. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది వైసీపీ. 2013లో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం సైతం జరుగుతోంది. అయితే తమను నవరత్నాలే కాపాడుతాయని వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీతో టీడీపీ కలిసి పనిచేసే అవకాశం లేకపోలేదు. మద్యం, ఇసుక పాలసీలతో పాటు ఉద్యోగాల కల్పనలోనూ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

పోలవరం, రాజధాని ఏర్పాటు, ప్రత్యేక హోదా వంటి విషయాలపై వచ్చే ఎన్నికల టైంలో ప్రజలు వైసీపీ తప్పనిసరిగా ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి. దీనికి తోడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత దూషనలు చేయడం, బురదచల్లడం మానుకొని ఎన్నికల్లో గెలుపొందేందుకు వ్యూహాత్మకంగా ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉంది. స్థానిక ఎన్నికల్లోనూ ఏకపక్షంగా గెలిచామని, ప్రజలు తమవైపే ఉన్నారని వచ్చే ఎలక్షన్స్ తప్పకుండా గెలుస్తామని భ్రమ పడితే దెబ్బతినక తప్పదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Also Read : Chandrababu : ఆయన విషయంలో చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? కారణమేంటి?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel