Chandrababu : లీడర్స్‌కు చంద్రబాబు వార్నింగ్.. వారికి  నో చాన్స్ అంటూ క్లారిటీ..

Updated on: November 28, 2021

Chandrababu : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న టీడీపీని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గాడిలో పెట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించి నాయకులకు సైతం ఓవైపు దిశానిర్దేశం చేస్తూ మరో వైపు వార్నింగ్ చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన కామెంట్స్ లీడర్లలో గుబులు పుట్టిస్తున్నాయి. అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను అని, ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు అంటూ తన పార్టీ లీడర్లకే సీరియస్ వార్నింగు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.

జమ్మలమడుగులోని మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, ఆయన కొడుకు భూపేశ్‌రెడ్డి, ఆదినారాయణ రెడ్డి సోదరుడు నారాయణ రెడ్డితో పాటు పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ టైంలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఎలక్షన్స్‌ టైంలో పార్టీలు మారుతున్న లీడర్లకు అదరిపోయే వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కోసం పనిచేసే వారికే తప్ప వలసలను నమ్ముకునే వారికి వచ్చే ఎలక్షన్స్‌లో టికెట్ ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం హల్ చల్ అవుతున్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారికి మాత్రమే పదవులు ఇస్తామంటూ స్పష్టం చేశారు.

ఎన్నికల ముందు పార్టీలో చేరే నాయకులకు ఎక్కువ ప్రాధాన్యత ఉండదన్నారు. దీంతో వచ్చే ఎలక్షన్స్ టైం వరకు టీడీపీలో చేరాలని భావిస్తున్న వారికి చంద్రబాబు చేసిన కామెంట్స్ షాక్ ఇవ్వనున్నాయి. పార్టీలో ఎవరెవరు పనిచేస్తున్నారనే లెక్కులు వేసుకుంటున్నారు బాబు. పార్టీ కోసం పని చేయకుండా ఉన్న వారిని ఉపేక్షించబోమని వార్నింగ్ ఇచ్చారు. ఈ మాటలు విన్న నాయకుల్లో భయం మొదలైంది. పార్టీలో పనిచేసే వారికే మొదటి ప్రియారిటీ వారి తర్వాతే వలస వచ్చిన వారికే ప్రాధాన్యత ఉంటుందని కుండ బద్దలు కొట్టారు. మరి వచ్చే ఎన్నికల వరకు పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Advertisement

Read Also : CM KCR Delhi Tour : ఢిల్లీకి వెళ్లి అమీతుమీ తేల్చుకుని వస్తానన్న కేసీఆర్.. ఏం సాధించారు?

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel