వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, , ,

Viral Video: నాటు నాటు పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన యువకులు.. వైరల్ అవుతున్న వీడియో..!

Viral Video: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా అన్ని భాషలలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా రాజమౌళి టాలీవుడ్ సినిమా గొప్పతనం గురించి ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా విడుదల ఇప్పటివరకు భారీ స్థాయిలో కలెక్షన్లు చేసి కొత్త ... Read more

By Ramesh Babu

Published on: May 9, 2022 3:34 PM

Updated on: May 9, 2022 7:00 PM

---Advertisement---

Viral Video: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా అన్ని భాషలలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా రాజమౌళి టాలీవుడ్ సినిమా గొప్పతనం గురించి ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోలు అయిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా విడుదల ఇప్పటివరకు భారీ స్థాయిలో కలెక్షన్లు చేసి కొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు.

ఈ సినిమాలోని పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ఎక్కడ చూసినా ఈ సినిమాలోని పాటలు మార్మోగుతున్నాయి. ఈ సినిమాలోని పాటలకు యువత స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని నాటు నాటు పాటకు రాజమౌళి ఇద్దరి హీరోలతో స్టెప్పులు వేయించాడు. ఈ పాట బాగా పాపులర్ అయ్యింది. ఈ పాటకు సంబంధించిన ఒక ఫన్నీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగులో నాటు నాటు అంటూ సాగిపోయే ఈ పాటని హిందీలో
నాచో-నాచో గా రీమేక్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by GiDDa CoMpAnY (@giedde)

ఈ పాటకి కొంతమంది యువత వేసిన స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాటు నాటు పాటకి డాన్స్ చేస్తున్న యువత సిగ్నేచర్ స్టెప్ వేసే క్రమంలో కింద పడి దొర్లుతూ రచ్చరచ్చ చేశారు. ఈ వీడియో చూసిన వారందరూ ఇదేం డాన్స్ రా నాయనా అంటూ తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియోలో కొంతమంది యువత నాటు నాటు పాటకి స్టెప్పులు వేస్తూ సిగ్నేచర్ మూమెంట్ వేసే సమయంలో కిందపడి దొర్లుతూ భుజం కదిలిస్తూ దాని సహాయంతో వృత్తాకారంలో తిరుతుంటారు. చివరకు ఒక యువకుడు మాత్రమే ఈ స్టెప్ ని పూర్తి చేశాడు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ వీడియో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Join our WhatsApp Channel