Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Pushpa movie fever: జవాబులు రాసేదె లే అంటూ పదో తరగతి బాలుడి ఆన్సర్.. ఎక్కడో తెలుసా?

పుష్ప సినిమా వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా... ఆ సినిమా ఫీవర్ మాత్రం ఇంకా వదలట్లేదు. సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ... ఆ సినిమా డైలాగులు, పాటలు, డ్యా

By Vinod Kumar

Published on: April 8, 2022 11:18 AM

Updated on: April 8, 2022 11:18 AM

---Advertisement---

పుష్ప సినిమా వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా… ఆ సినిమా ఫీవర్ మాత్రం ఇంకా వదలట్లేదు. సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ… ఆ సినిమా డైలాగులు, పాటలు, డ్యాన్సులను అభిమానులంతా తమ తమ స్టైల్ లో చేస్తూ అలరిస్తున్నారు. ఇప్పటి వరకు మనం ఇలాంటివే చూశాం. కానీ ఓ పదో తరగతి బాలుడు ఈ సినిమా డైలాగ్ ని పరీక్షల్లోని జవాబుల పత్రంలో రాశాడు. అయితే ఈ ఘటన బెంగాల్ లో చోటు చేసుకుంది.

పుష్ప.. పుష్పరాజ్ డైలాగ్ ను అనుకరిస్తూ… ఓ పదో తరగతి విద్యార్థి త జవాబు పత్రంలో ఇదే డైలాగ్ రాశాడు. పుష్ప.. పుష్పరాజ్.. జవాబులు రాసేదే లే అని రాసి పెట్టాడు. పేపర్లు దిద్దే ఉపాధ్యాయుడు దీన్ని చూసి తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యాడు. ఏం చేయాలో పాలుపోక చాలా సేపు నవ్వుకున్నాడు. ఆ తర్వాత దాన్ని ఫొటో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేశాడు.

Advertisement

, ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :